టాలీవుడ్ లో స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు చేసినా స్టార్ డైరెక్టర్ కాలేకపోయినా బాబీ ఇప్పుడు తానొక పెద్ద డైరెక్టర్ ని అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన డైరెక్టర్ బాబీ గత రాత్రి అమీర్‌పేటకు చెందిన హర్మిందర్ సింగ్ అనే అతని కారుని తన కారుతో డాష్ ఇచ్చాడు. అమీర్‌పేటకు చెందిన హర్మిందర్ సింగ్ తన కుటుంబంతో కలిసి మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో జరిగిన ఒక ఫంక్షన్ కి అటెండ్ అయ్యి రాత్రి మూడున్నర ప్రాంతంలో తిరిగి వస్తుండగా... జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 33 వరకు రాగానే, దర్శకుడు బాబీ కారు వెనక నుంచి వచ్చి హర్మిందర్ కారును బలంగా ఢీకొట్టింది.
అయితే ఈ యాక్సిడెంట్ లో హర్మిందర్ సింగ్ కుటుంబ సభ్యులకు దెబ్బలు తగలేకపోయినా.. హర్మిందర్ సింగ్ కారు వెనుక భాగం మాత్రం డామేజ్ అయ్యింది. అయితే హర్మిందర్ సింగ్ వెంటనే కారు దిగి బాబీని అడ్డగించగా.. కారులో ఉన్న బాబీతో పాటుగా మరో ఇద్దరు హర్మిందర్ సింగ్ కారుని ఢీ కొట్టినందుకు తప్పు ఒప్పుకోకపోగా... హర్మిందర్ సింగ్ ని బెదిరించే ప్రయత్నం చెయ్యడం.. అలాగే తానొక పెద్ద డైరెక్టర్ ని అని తమ ఇల్లు పక్కనే ఉందని మాట్లాడుకుందామని పిలువగా.... హర్మిందర్ సింగ్ సరే అన్నాడట .
అయితే ఈలోపు అక్కడే ఉన్న హర్మిందర్ సింగ్ తల్లికి గుండెపోటు రావడంతో.. హర్మిందర్ సింగ్ తన తల్లికి సేవలు చేస్తున్న టైం లో తమకి ఇండస్ట్రీలోని పలువురు తెలుసనీ.. బాబీ ఫోన్ లో పవన్ సర్ అంటూ మాట్లాడుతూ అక్కడనుండి మెల్లగా వెళ్లిపోయాడని.. అందుకే తాను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో డైరెక్టర్ బాబీపై కంప్లైంట్ చేశానని.. సోషల్ మీడియాలో హర్మిందర్ సింగ్ ట్వీట్ చేశాడు. ఎంత పెద్ద డైరెక్టర్ అయితే మాత్రం యాక్సిడెంట్ చేసి తప్పించుకుందామనుకున్నాడో ఏమో..బాబీ.