Advertisement
Google Ads BL

కాజల్ కి అదృష్టం అలా కలిసొస్తుంది మరి!


సాధారణంగా కొండంత కష్టం, శ్రమ ఉన్నా కూడా ఓ వ్యక్తి ఏరంగంలోనైనా రాణించాలంటే గోరంత అదృష్టం కూడా కలసి రావాలని అందరు చెబుతూ ఉంటారు. ఇదే నయనతార, త్రిష, తమన్నా, శ్రియ వంటి వారికి ఉంది. ఈ కోవలోకి వచ్చే భామే కాజల్‌ అగర్వాల్‌. ఈమె ఉత్తరాది యువతి అయినా అచ్చు తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటుంది. సాధారణంగా నేడున్న పోటీలో ఏ హీరోయిన్‌ అయినా 15ఏళ్ల పాటు అవకాశాలు సంపాదిస్తూ రాణించడం అంటే చిన్న విషయం కాదు. దానిని కాజల్‌ అగర్వాల్‌ చేసి నిరూపించింది. ఒకటిన్నర దశాబ్దంగా ఈమె తన హవాని చాటుతూనే ఉంది. మెగాస్టార్‌ చిరంజీవి, అజిత్‌ నుంచి విజయ్‌, మహేష్‌బాబు, ప్రభాస్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, పవన్‌కళ్యాణ్‌ ఇలా అందరినీ చుట్టేసింది. ఇక గత ఏడాది ఈమె నటించిన 'వివేగం, మెర్శల్, నేనే రాజు నేనే మంత్రి' వంటి చిత్రాలు ఈమెకి మంచి పేరునే తెచ్చాయి. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే కాజల్‌ జోరు కాస్త ఇప్పుడు తగ్గిందనే చెప్పాలి. అయినా కూడా ఆమె ప్రస్తుతం కోలీవుడ్‌లో బాలీవుడ్‌ 'క్వీన్‌' రీమేక్‌గా 'ప్యారిస్‌ ప్యారిస్‌' చిత్రంలో నటిస్తోంది. ఇక తాజాగా ఈమె రానా తర్వాత మరో యంగ్‌ హీరో అయిన శర్వానంద్‌ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పింది. ఈమె తాజాగా మాట్లాడుతూ, యంగ్‌ హీరోలతో నటించడానికి నేను సిద్దమే. ఏ ఇండస్ట్రీలో అయినా సరే కాలంతో పాటు మారాలి. ఈ ఫీల్డ్‌లో అది మరింత ముఖ్యం. ఇక్కడ నిలబడాలంటే కాలంతో తగ్గట్టుగా మనం మారాలి. ఇక నేను ఇండస్ట్రీకి వచ్చి 15ఏళ్లు అయినా ఎంతో అందంగా ఫిట్నెస్‌తో ఉన్నానని పలువురు పొగుడుతూ ఉంటారు. నా అందం కాపాడుకునేందుకు నేను నిరంతరం కష్టపడుతూనే ఉంటాను. విజయానికి షాట్‌కట్స్‌ ఏమీ ఉండవు. మనం ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మారాల్సివుంటుంది. 

ఇక నా పాత్రకు న్యాయం చేయడానికి ఎంతైనా కష్టపడతాను. కాబట్టే నేను ఇంత కాలం ఇండస్ట్రీలో ఉండగలిగాను అని చెబుతూ, తాను శర్వానంద్‌ సరసన నటించేందుకు అంగీకరించిన విషయాన్ని అఫీషియల్‌గా తెలిపింది.

Kajal Happy With Her Luck:

Kajal Agarwal Busy With Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs