Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ పోస్టర్ పై వర్మ తేడా కామెంట్!


ఒక మగాడు ఎవరైనా ఆడవారిని చూసి భలే సెక్సీగా ఉన్నావు అంటే అది మంచి కాంప్లిమెంట్‌ కిందకి వస్తుంది. కానీ అలా చేస్తే అతను వర్మ ఎందుకు అవుతాడు? ఆయనకు మగాళ్లలో మ్యాన్లీనెస్‌ కూడా సెక్సీగానే కనిపిస్తూ ఉంటుంది. బహుశా ఆయన నేచర్‌ అదే కాబట్టి ఆయన పవన్‌, రవితేజ విషయంలో కొంతకాలం కిందట ఇలాంటి చీప్‌ వ్యాఖ్యలే చేశాడు. తాజాగా ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, పూజాహెగ్డే జంటగా హారిక అండ్‌ హాసిని సంస్థ నిర్మిస్తోన్న టైటిల్‌ని, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్‌ సిక్స్‌ప్యాక్‌లో చేతిలో కొడవలి వంటి కత్తితో అగ్రెసివ్‌గా కనిపిస్తూ ఉన్నాడు. టైటిల్‌గా 'అరవింద్‌ సమేత' అని పెట్టి కింద జంప్‌లైన్‌గా 'వీరరాఘవ' అని పెట్టారు. 

Advertisement
CJ Advs

ఈ ఫస్ట్‌లుక్‌పై వర్మ తనదైన శైలిలో కామెంట్‌ చేశాడు. వావ్‌..వ్‌..వ్‌...సిక్స్‌ప్యాక్‌లో తారక్‌..సెక్స్‌ కన్నా ఎంతో సెక్సీగా ఎప్పుడు చూడనంతగా ఉన్నాడు.. అని ట్వీట్‌ చేశాడు. అయినా వర్మ మగవారిని చూసే కోణంలో ఏదో తేడా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక హారిక అండ్‌ హాసిని టీమ్‌ ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా యంగ్‌టైగర్‌ అభిమానులకు అంతులేని ఆనందాన్ని కలిగించింది. అందరు టైటిల్‌తో కూడిన ఫస్ట్‌ లుక్‌ మాత్రమే వస్తుందని భావించారు. అది ఓకే అయింది. ఆ తర్వాత వెంటనే ఎన్టీఆర్‌ ఎంతో కూల్‌గా కాఫీ తాగుతున్న లుక్‌ని క్లాసీగా ఉండేలా డిజైన్‌ చేసి వదిలారు. ఆ తర్వాత ఈ చిత్రం టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ని వారు లాంచ్‌ చేశారు. ఇందులో ఎన్టీఆర్‌, పూజాహెగ్డే కలిసి పిట్టగోడపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తున్నారు. 

మొత్తానికి ఎన్టీఆర్‌ బర్త్‌డేకి హారిక అండ్‌ హాసిని బేనర్‌ ఏకంగా మూడు గిఫ్ట్‌లను అందించింది. దీంతో ఒకటిన్నర నెలకే ఇన్ని గిఫ్ట్‌లు ఇచ్చిన యూనిట్‌ భవిష్యత్తులో ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ఇవ్వనుందో వేచిచూడాల్సివుంది...! 

RGV Comment on Aravinda Sametha Poster:

RGV Sexy Tweet on JR NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs