Advertisement
Google Ads BL

నేహా ధూపియా పంచ్ అదిరింది!


కాలం వేగంగా మారుతోంది. మరీ ముఖ్యంగా భార్య కంటే భర్త వయసు ఎక్కువగా ఉండాలనే పద్దతి కాస్త కాస్త మారుతోంది. సైంటిఫిక్‌గా దీని విషయం పక్కన పెడితే వయసులో తమకన్నాపెద్దవారిని చేసుకున్న వారి మీద కథలు, సినిమాలు వస్తున్నాయి. సచిన్‌టెండూల్కర్‌ నుంచి తమకంటే వయసులో పెద్ద వారిని వివాహం చేసుకుంటున్నారు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా విషయానికి వస్తే నటి నేహా ధూపియా కూడా తనకంటే వయసులో రెండేళ్లు చిన్నవాడైన నటుడు అంగద్‌ బేడీని వివాహం చేసుకుంది. వివాహం గోప్యంగా చేసుకున్నప్పటికీ తర్వాత ఆమె తమ పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆమె వైవాహిక జీవితం బాగుండాలని పలువురు ఆమెకి శుభాకాంక్షలు తెలుపగా ఓ నెటిజన్‌ మాత్రం ఆమెకి చిర్రెత్తించే విధంగా కామెంట్‌ చేయడం ఆమెకి కోపం తెప్పించింది. అంగద్‌బేడీ తాజా సినిమా 'సూర్మా'లోని ఆయన పాత్రను పరిచయం చేస్తూ నేహాధూపియా ఓ పోస్ట్‌ పెట్టింది. దానికి అభినందనలు తెలిపి కొత్త జంట బాగుండాలని కోరుకోకుండా ఓ నెటిజన్‌ ఆమె భర్తని ఆమెకి తమ్ముడితో పోల్చాడు. ఆ నెటిజన్‌ ట్వీట్‌ చేస్తూ అతను నేహా కన్నా రెండేళ్లు చిన్న అనే విషయాన్ని గుర్తు చేస్తూ అతను భర్త కాదని, తమ్ముడి వంటి వాడని, ఆయనకు నేహా రాఖీ కట్టాలని వెకిలిగా పోస్ట్‌ చేశాడు. 

ఆల్‌రెడీ భార్యాభర్తలైన వారిని ఇలా కామెంట్‌ చేయడం నిజంగా తీవ్రంగా బాధించే విషయమే. దీనికి స్పందించిన నేహాధూపియా 'నీ సలహా నచ్చిందబ్బాయ్‌' అంటూనే ఓ సెటైర్‌ వేసింది. తనకో ఫేవర్‌ చేయాలని చెబుతూ, 'నీ జీవితం ఏమిటో నువ్వు చూసుకో' అని పంచ్‌ విసిరింది. ఇలాంటి ఆకతాయీలకు బహుశా ఇలాంటి పంచ్‌లు సరిపోవేమో అనిచెప్పాలి. 

Neha Dhupia Satire on Netizen:

Neha Dhupia Hurted With Netizen Comment
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs