Advertisement
Google Ads BL

'అరవింద సమేత'... టైటిల్ పై రగడ స్టార్ట్!


త్రివిక్రమ్ తన సినిమాలకు ఆచి తూచి టైటిల్స్ ని సెలెక్ట్ చేస్తుంటాడు. దాదాపుగా సినిమా షూటింగ్ చివరి వరకు తన సినిమాల టైటిల్ విషయంలో చాలా కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తాడు. అలాగే తన సినిమాలకు ఎక్కువగా మూడక్షరాలను వాడే త్రివిక్రమ్ అత్తారింటికి దారేది అంటూ 'అ' టైటిల్ సెంటిమెంట్ కి తెర లేపాడు. 'అతడు, అత్తారింటికి దారేది, అ.. ఆ' సినిమాలు సెంటిమెంట్ తోనే పవన్ కళ్యాణ్ సినిమాకి అజ్ఞాతవాసి అనే టైటిల్ పెట్టగా. అది కాస్తా తుస్ మంది. ఇక త్రివిక్రమ్ టైటిల్ విషయంలో తీవ్ర ఆలోచన చేశాడు. మాములుగా తన సినిమాల టైటిళ్ల విషయంలో ప్రతిసారీ కన్ఫ్యూజన్ కి గురవుతుంటాడు. 

Advertisement
CJ Advs

ముందు నుండి కొన్ని టైటిళ్లు అనుకుని... వాటిని చిత్ర బృందం ద్వారా  మీడియాకు లీకులిస్తాడు. అయితే తాను అనుకున్న టైటిల్స్ కి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి చివరగా ఒకటి ఫైనలైజ్ చేస్తాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో తాను తెరకెక్కిస్తున్న సినిమా టైటిల్ విషయంలోనూ త్రివిక్రమ్ ఇదే పద్దతిని ఫాలో అయ్యాడు. ముందు నుండి 'అసామాన్యుడు' అనే టైటిల్ ని లీక్ చేసి ఉంచాడు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి ఆ టైటిల్ విషయంలో వ్యతిరేఖత వినబడింది. తర్వాత 'అరవింద సమేత సిద్దార్ద్' కానీ.. 'అరవింద సమేత రాఘవ' గాని అన్నారు. కానీ ఫైనలా గా 'అరవింద సమేత వీర రాఘవ' అనే టైటిల్ ని పెట్టాడు.

అయితే 'అరవింద సమేత' అనేది క్యాప్షన్ గా ఉండాల్సిన పదం. 'వీర రాఘవ' అనేది మెయిన్ టైటిల్ అవ్వాల్సిన పదం. కానీ ఇక్కడ త్రివిక్రమ్ టైటిల్ ని తిరగేసి పెట్టినట్లుగా కనబడుతుంది.  'అరవింద సమేత వీర రాఘవ' ఏమిటి.. 'వీర రాఘవ.. అరవింద సమేత' అని ఉండాలి గాని అనే అనుమానం చాలా మందిలో ఉంది. ఎందుకంటే 'వీర రాఘవ' అనే టైటిల్ ఎన్టీఆర్ ని ఉద్దేశించి ఉంటుంది. కానీ 'అరవింద సమేత' అనేది హీరోయిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేదిగా ఉంటుంది. మరి త్రివిక్రమ్ కన్ఫ్యూజ్ అయ్యాడా.. లేదంటే 'అ' సెంటిమెంట్ ని నమ్మి 'అరవింద సమేత' అని పెట్టాడా అనేది ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల్లో ఉన్న పెద్ద డౌట్. 'అ' సెంటిమెంట్ తో టైటిల్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందు అస్సలు ఒప్పుకోలేదు. కానీ చివరికి మిగిలింది 'అరవింద సమేత'నే. కానీ త్రివిక్రమ్ టైటిల్ విషయంలో ఎందుకు తికమక పడ్డాడో అనేది దసరాకి గాని క్లారిటీ రాదు.

Fans Unhappy With Aravinda Sametha Title:

Trivikram Confuses all With Aravinda Samantha Title
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs