Advertisement
Google Ads BL

కళ్యాణ్‌కృష్ణ క్లారిటీ ఇచ్చేశాడు..!


నేను హైదరాబాద్‌కి వచ్చినప్పటి నుంచి ప్రతి సినిమాని రెండు సార్లు చూసేవాడిని. నేల టిక్కెట్‌, బాల్కనీలో చూస్తాను. సాధారణంగా బాల్కనీ ప్రేక్షకులు లాజిక్స్‌లను ఆలోచిస్తారు. ఫలాన సీన్‌ అలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది కదా అనుకుంటారు. నాచిత్రం టైటిల్‌ 'నేలటిక్కెట్‌' అయినా బాల్కనీ ఆడియన్స్‌కి కూడా నచ్చుతుంది. ఎవరికి లాజిక్‌గా దొరకకుండా, ఇలాగే తీయాలి అనే విధంగా ఉంటుంది. రవితేజ సినిమా అంటే ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. ఇందులో 70శాతం అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. రవితేజ క్యారెక్టర్‌లో రెండు యాంగిల్స్‌ ఉంటాయి. ఒకటి కామెడీ, రెండోది ఫైర్‌ యాంగిల్‌. చుట్టూ జనం, మధ్యలో మనం ఉండాలి అని భావించే క్యారెక్టర్‌ ఆయనది. 

Advertisement
CJ Advs

ఇక రామ్‌ తాళ్లూరి గారికి ఇదే మొదటి సినిమా అయినా ఎక్కడా అలా అనిపించలేదు. రవితేజ స్పీడ్‌, టీం కష్టంతో పెద్ద కాస్టింగ్‌ ఉన్న ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేస్తున్నాం. మాళవిక శర్మ మంచి క్యారెక్టర్‌ చేసింది. శక్తికాంత్‌ కార్తీక్‌ మంచి సంగీతం అందించాడు. ఈ సినిమా సమయంలో రవితేజలోని సిన్సియారిటీ నేర్చుకున్నాను. ఫలానా పని ఏ రోజు చేయాలంటే అదే రోజు ఖచ్చితంగా ఆయన పూర్తి చేస్తాడు. స్క్రీన్‌ మీద ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటాడో నిజజీవితంలో కూడా అంతే ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఫ్యామిలీ అందరు చూసి ఇష్టపడే చిత్రాలనే నేను ఇష్టపడతాను. 'రంగస్థలం, మహానటి'లు ప్రయోగాలు కావు. రియలిస్టిక్‌, కన్వెక్షన్‌తో పాయింట్‌ని చెప్పిన చిత్రాలు అవి. ఎక్స్‌పరమెంట్‌తో కాకుండా కన్విక్షన్‌తో చిత్రం తీయాలనేది నా అభిమతం. సీనియర్‌ సిటిజన్స్‌కి మనం రెస్పెక్ట్‌ ఇవ్వడం లేదు. దాంతో దీనిపై ఓ సీక్వెల్‌ తీశాను. వారిని గౌరవించాలి. నిలువెత్తు అనుభవం వారు అనే డైలాగ్‌ కూడా రాసుకున్నాను. 

'నేలటిక్కెట్‌' తర్వాత 'సోగ్గాడే చిన్నినాయనా'కి ప్రీక్వెల్‌గా 'బంగార్రాజు' అనే కథ సిద్దం చేసుకుంటున్నాను. త్వరలో నాగార్జున గారికి వినిపిస్తాను. జులై లేదా ఆగష్టులోఈ చిత్రం ప్రారంభమవుతుంది అంటూ 'సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్‌ వేడుక చూద్దాం' తర్వాత 'నేలటిక్కెట్‌'తో హ్యాట్రిక్‌పై కన్నేసిని కళ్యాణ్‌కృష్ణ కురసాల చెప్పుకొచ్చాడు. 

Kalyan Krishna About Nela Ticket :

Kalyan Krishna Latest Interview Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs