తమిళంలో కమెడియన్‌గా, సపోర్టింగ్ నటునిగా మనోబాలకు మంచి పేరుంది. ఈయన 1953 డిసెంబర్8వ తేదీన తమిళనాడులో జన్మించాడు. ఈయన తమిళంలో దర్శకుడు, నిర్మాత కూడా. 900లకు పైగా చిత్రాలలో నటించాడు. 40చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 19 టెలిసీరియల్స్‌కి, 9 టెలిఫిల్మ్స్‌కి దర్శకత్వం వహించాడు. ఇక ఈయన తాజాగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'మహానటి' చిత్రంలో తమిళ దర్శకుడి పాత్రను చేసి నవ్వులు పూయించాడు.
ఇక తనకు 'మహానటి' తర్వాత తెలుగులో స్ట్రయిట్ చిత్రాలకు ఎక్కువగా వేషాలు వస్తున్నాయని ఆయన తెలిపాడు. ఇలా నాకు తమిళంతో పాటు తెలుగులో కూడా అవకాశాలు పెరగడం ఆనందంగా ఉంది. తాజాగా నాగార్జున-నాని హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రంలో కూడా అశ్వనీదత్ ప్రోత్సాహంతో మంచి పాత్ర వచ్చింది. సంతోషం అని తెలిపాడు. ఇక ఈయన తమిళంలో రజనీకాంత్, కమల్‌హాసన్, సూర్య, విక్రమ్ వంటి ఎందరో స్టార్స్ చిత్రాలలో నటించడమే కాదు.. దర్శకునిగా, నిర్మాతగా కూడా తమిళంలో సక్సెస్ అయి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నాడు. మొత్తానికి 'మహానటి' వలన మరలా మనోబాలను తెలుగులో చూసే అవకాశం రావడం సంతోషకరమైన విషయం.
ఇంతకు ముందు డబ్బింగ్ చిత్రాల ద్వారానే గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇకపై తెలుగు స్ట్రెయిట్ చిత్రాలలో కూడా చాన్స్‌లు దక్కించుకుంటూ ఉండటం విశేషమనే చెప్పాలి. ఇక 'మహానటి'కి తమిళ వెర్షన్ అయిన 'నడిగైయర్‌తిలగం' చిత్రం తమిళనాట కూడా సూపర్‌హిట్ దిశగా సాగుతోంది.