Advertisement
Google Ads BL

రేష్మి.. ఐదేళ్ల మ్యాజిక్‌..!


ప్రస్తుతం ఉన్న హాట్‌ యాంకర్స్‌తో పాటు సుమ, ఝాన్సీ, ఉదయభాను వంటి వారు వెండితెరపై కనిపించిన వారే. ఇక ప్రస్తుతం అనసూయ, శ్రీముఖిలు కూడా బుల్లితెర మీదనే కాకుండా వెండితెరపై కూడా మురిపిస్తున్నారు. వీరు బుల్లితెరకు రాకముందే సినిమాలలో చిన్నాచితకా వేషాలువేసి, సరైన గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరపై కనిపించి, మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం వెండితెరపై చెప్పుకోదగ్గ పాత్రలను అందుకుంటున్నారు. ఇదేకోవలోకి చెందిన హాట్‌ యాంకర్‌ రేష్మి గౌతమ్‌. ఈమె యాంకర్‌ కాకముందే సినిమాలలో చిన్నాచితకా వేషాలు వేసింది. 

Advertisement
CJ Advs

ఇక 'జబర్ధస్త్‌, ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌'లతో ఈమె మరింత గుర్తింపును తెచ్చుకుంది. ముఖ్యంగా 'గుంటూరు టాకీస్‌' చిత్రంతో ఈమె ఓ ట్రెండ్‌ని క్రియేట్‌ చేసింది. ఇక ఇటీవల వచ్చిన 'నెక్ట్స్‌ నువ్వే' చిత్రం సరిగా ఆడలేదు. దాంతో ఆమెకి వెండితెర వేషాలు తగ్గాయి. ఇక ఈమె బుల్లితెరపై 'జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌'లు ద్వారా ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమెని అభిమానులు అభినందనలతో ముంచెత్తారు. 'జబర్ధస్త్‌, ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌'ల ద్వారా ఐదేళ్లు పూర్తి చేసుకున్న రేష్మికి శుభాకాంక్షలు. 260 వారాల మేజిక్‌. రేష్మి పిల్లకు ప్రేమతో అని ఓ నెటిజన్‌ ట్విట్టర్‌లో స్పందించాడు. దానికి రేష్మి ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. రేష్మి ఇప్పటికీ ఫస్ట్‌షోలో చూసిన అమ్మాయిలానే ఉంది. 'జబర్ధస్త్‌'లేకపోతే రేష్మి ఎవరో తెలిసేది కాదు. ఇప్పుడు రేష్మి లేకుండా ప్రత్యేక కార్యక్రమం అంటూ లేదని మరో నెటిజన్‌ స్పందించాడు. 

ఇక ఈ సందర్భంగా ఈమె ఆరెంజ్‌ డ్రస్‌లో క్లీవేజ్‌ షో చేస్తూ అందరి మతులను పోగొడుతోంది. మరి ఈమెకి సినిమాలలో మరలా ఎప్పుడు బ్రేక్‌ వస్తుందో వేచిచూడాల్సివుంది.....! 

Rashmi Gautam about 'Jabardasth' :

Rashmi Gautam thanks fans for 5 years of 'Jabardasth' and 'Extra Jabardasth'
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs