Advertisement
Google Ads BL

తేజూ ఊదితే బ్రీత్‌ ఎనలైజర్‌ ఎంత చూపిందంటే?


ఈమధ్య సెలబ్రిటీ హోదా వచ్చిన పలువురు హైదరాబాద్‌లో మరీ ముఖ్యంగా సినిమా వారు, ధనవంతులు ఎక్కువగా ఉండే జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌ వంటి ప్రాంతాలలో మద్యం సేవించి పోలీసులకు అడ్డంగా బుక్కవుతున్నారు. ఇక శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ దారిలో, రింగు రోడ్డుపై వీళ్ళు మద్యం సేవించి బైక్‌, కారు రేస్‌లు చేస్తూ పరువు పొగొట్టుకుంటున్నారు. ఇటీవల న్యూఇయర్‌ వేడుక సందర్భంగా యాంకర్‌, నటుడు ప్రదీప్‌తో పాటు పలువురు పట్టుబడుతున్నారు. మరికొందరైతే మద్యం తాగి తరచు ప్రమాదాలకు లోనై ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. 

Advertisement
CJ Advs

ఇక హైదరాబాద్‌ పోలీసులు కూడా ఈ విషయంలో చాలా కఠినంగా ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ని చేపట్టారు. ఈ సందర్భంగా మందు బాబులు అడ్డంగా బుక్‌ అయ్యారు. 22కార్లు, 29 బైకులు, ఒక ఆటోని పోలీసులు సీజ్‌ చేసి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులను పెట్టారు. ఇందులో ఓ మహిళ తన కారుని తిరిగి ఇవ్వాలని పోలీసులను ఎంతగా బతిమాలినప్పటికీ పోలీసులు మాత్రం తమ విధిని నిర్వర్తించారు. ఇక అదే సమయంలో మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ అటుగా కారులో వచ్చారు. పోలీసులు కూడా తమ డ్యూటీ ప్రకారం ఆయనకు బ్రీత్‌ ఎనలైజ్‌ పరీక్షలు నిర్వహించారు. 

ఇందులో ఆయన చుక్క కూడా మందు తాగలేదని, జీరోగా బ్రీత్‌ ఎనలైజర్‌ చూపించడంతో సాయిధరమ్‌తేజ్‌ వెళ్లిపోయాడు. కేవలం సినిమా వారు, సెలబ్రిటీల మీద ఇలాంటి కేసులు వచ్చినప్పుడు వారిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న నేపధ్యంలో పలువురు సెలబ్రిటీలు మద్యం తాగాలనిపిస్తే తమకు కారు డ్రైవర్‌లను కూడా వెంట బెట్టుకుని వెళ్తుండటం వారిలో వచ్చిన మార్పుని తెలియజేస్తోంది. 

Mega Hero caught in Drunk and Drive Test:

Sai Dharam Tej has arrived in his car and the police also conducted the Breath Analyzer Test for him
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs