సినిమా రంగంలో కొన్ని పుకార్లు బాగా వ్యాపిస్తూ ఉంటాయి. వీటికి తలాతోకా ఎలాంటి నిజం లేకపోయినా అవి వూహాజనితంగా మారి నిజమేనన్న భ్రమను కలిగిస్తున్నాయి. ఇప్పుడు తేజ విషయంలో అదే జరిగింది. నిజానికి 'మహానటి' వంటి బయోపిక్ హిట్ కావడం, ఉదయ్‌కిరణ్ జీవితం ఎంతో సినిమాటిక్‌గా ఉన్న నేపధ్యంలో మరణించిన ఈ హీరోపై తేజ ఓ బయోపిక్ తీయనున్నాడని వార్తలు వచ్చాయి. అందునా ఆయన ఎన్టీఆర్ బయోపిక్ నుంచి బయటికి రావడం కూడా దీనికి ఒక కారణం. అందులోనే 'కాబోయే అల్లుడు' అనే టైటిల్ రిజిష్టర్ కావడం, తేజ రాజశేఖర్‌ని కూడా కలవడంతో ఇందులో చిరంజీవి పాత్రను రాజశేఖర్ నటించనున్నాడని వార్తలు వచ్చాయి.
కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని, ఇదంతా సొల్లేనని తేజ తేల్చేశాడు. ప్రస్తుతం తేజ చేతిలో వెంకటేష్, బాలయ్య ఇద్దరి చిత్రాలు లేవు. ఈ నేపధ్యంలో ఆయన 'నేనే రాజు...నేనే మంత్రి' తర్వాత మరలా రానాతోనే ఓ పక్కా కమర్షియల్ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రంలోని విలన్ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందని, దీనిని కేవలం రాజశేఖర్ మాత్రమే చేయగలడనే ఉద్దేశ్యంతోనే తాను రాజశేఖర్‌తో మంతనాలు జరుపుతున్నట్లు తేజ తేల్చిచెప్పాడు. ఇక గతంలో కూడా రాజశేఖర్ హీరోగానే 'నేనేరాజు... నేనేమంత్రి' చిత్రం మొదట తీశారు. కానీ క్లైమాక్స్ విషయంలో మనస్పర్ధలు రావడంతో 'అహం' చిత్రాన్ని వదిలేసి తేజ రానాతో చిత్రం తీశాడు.
ఇక తన తదుపరి చిత్రం కూడా రానాతోనేనని, రాజశేఖర్ విలన్‌గా చేస్తే అద్భుతంగా ఉంటుందని అంటుండటంతో తేజ చేతుల ద్వారా పరిచయమయ్యే హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లతో పాటు విలన్లకు కూడా మంచి క్రేజ్ వస్తుందనే ఉద్దేశ్యంతో రాజశేఖర్ ఈ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తాడో లేదో వేచిచూడాల్సివుంది....!