రాంగోపాల్‌వర్మ 'శివ' నుంచి ప్రతి చిత్రం ఏదో ఒక సంఘటన ఆధారంగానో, లేదా ఎవరైనా వ్యక్తుల జీవిత చరిత్రల స్ఫూర్తితోనో సినిమాలను తీస్తూ ఉంటాడు. విజయవాడలో తాను కాలేజీ రోజుల్లో చూసిన రౌడీయిజంకి 'బ్రూస్‌లీ' చిత్రాలను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని 'శివ', పరిటాల రవి 'రక్తచరిత్ర', వీరప్పన్ ఆధారంగా 'కిల్లింగ్ వీరప్పన్' ముంబై అటాక్స్ నేపధ్యంలో, ఇక బాల్‌థాక్రే, దావూద్ ఇబ్రహీం, కసబ్ వంటి వారి స్ఫూర్తితో సినిమాలు తీశాడు. ఇక ఈయన తాజాగా నాగార్జునతో 'ఆఫీసర్' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం అటు కోర్టు స్టే విషయంలోనూ, ఈ కథ నాదేనని జయకుమార్ అనే రచయిత ఆరోపణలతో వివాదం రేపుతోంది. ఈ చిత్రాన్ని వర్మ తన సొంత కంపెనీలో నిర్మిస్తున్నాడు. ఈ వివాదాలతో పాటు సినిమాకి బిజినెస్ జరగకపోవడం వల్లే దీనిని మే 25 నుంచి జూన్1కి పోస్ట్‌పోన్ చేసినట్లు సమాచారం.
ఇక ఈ 'ఆఫీసర్' చిత్రం హాలీవుడ్‌లో వచ్చిన 'టేకెన్' ఆధారంగా తీస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. వీటికి వర్మ చెక్ పెట్టాడు. ఈ చిత్రం కథను తాను కర్ణాటకకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ కేఎం ప్రసన్న జీవితం ఆధారంగా రూపొందించానని తెలిపాడు. ఆయన మాట్లాడుతూ, కేఎం ప్రసన్న స్పెషల్ ఇన్వ్‌స్టిగేషన్ టీంకు చీఫ్‌గా పనిచేశారు. 2010లో ప్రసన్న నాకు చెందిన యదార్ధ సంఘటనల ఆధారంగానే 'ఆఫీసర్'ని తెరకెక్కించాను. ప్రస్తుతం ఆయన ముంబై క్రైం బ్రాంచ్ అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీసుగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నాను. నేను ప్రసన్న, నాగార్జునలను ఇద్దరిని కలిసినప్పుడు వారిద్దరు మానసికంగా ఎంతో దృఢత్వం ఉన్న వారుగా అనిపించారు.
ఇక ప్రసన్నలో నాగార్జున పోలికలు కూడా బాగా ఉన్నాయి.. అని చెప్పుకొచ్చాడు. అయినా వర్మ అలాంటిది ఏదైనా ఉంటే షూటింగ్ ముందు నుంచే నానా హడావుడి చేసి సినిమా ప్రమోషన్‌కి వాడుకునే వాడు. కానీ ఆయన ఇప్పుడు కేవలం రిలీజ్ సమయంలోనే దానిని బయటపెట్టడం వెనుక కూడా ఏదైనా మార్కెటింగ్ స్ట్రాటర్జీ ఉందా? అనే అనుమానాలు మాత్రం వస్తున్నాయి.