Advertisement
Google Ads BL

బ్రహ్మీకి దెబ్బేసింది వీళ్లే..!!


నాన్ స్టాప్ గా మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమాల్లో హవా సాగించాడు బ్రహ్మానందం. కానీ ఈమధ్య అయన హావ నడవడంలేదు. అందుకు కారణం అతని కామెడీ చూసి చూసి జనాలకు బోర్ కొట్టింది. కెరీర్ స్టార్టింగ్ లో తన కామెడీతో జనాలకు బాగానే దగ్గర అయ్యాడు బ్రహ్మి. కానీ 2000 సంవత్సరం తర్వాత కాస్త జోరు తగ్గింది. అప్పుడు వేణుమాధవ్..సునీల్ హావ నడిచింది.

Advertisement
CJ Advs

మళ్లీ 2000 సంవత్సరం తర్వాత శ్రీను వైట్ల సినిమాలతో ఫామ్ లోకి వచ్చాడు బ్రహ్మి. బ్రహ్మిని అంతలా పైకి లేపింది శ్రీను వైట్ల సినిమాలే. అతని డైరెక్షన్ లో ‘ఢీ’.. ‘రెడీ’.. ‘కింగ్’.. ‘ఓం నమో వేంకటేశాయ’.. ‘బాద్ షా’..'దూకుడు' లాంటి సినిమాల్లో బ్రహ్మికి తిరుగులేని క్యారెక్టర్లు ఇచ్చి తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాడు వైట్ల. ఆ సినిమాలు హిట్స్ అవ్వడానికి కారణం  బ్రహ్మి హ్యాండ్ కూడా ఉందనే చెప్పాలి.

ఐతే ఈ క్రేజీ కాంబో తర్వాత దారి తప్పింది. అందుకు కారణం ఇటు వైట్ల కథలు.. అటు బ్రహ్మి పాత్రలు రొటీన్‌గా తయారై ప్రేక్షకులకు మొహం మొత్తింది. దీంతో వైట్ల బ్రహ్మికి బాయ్ చెప్పేశాడు. అలా అని వైట్ల బ్రహ్మి లేకుండా తీసిన సినిమాలు ఏమైనా సక్సెస్ అయ్యాయా అంటే అది లేదు. శ్రీను వైట్ల లేటెస్ట్ గా వరుణ్ తేజ హీరోగా 'మిస్టర్' సినిమా తీశాడు అది డిజాస్టర్ అయింది. మళ్లీ ఇప్పుడు రవితేజని హీరోగా పెట్టి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి శ్రీను వైట్ల ప్రముఖ కమెడియన్లతో షూటింగ్ స్పాట్ నుంచి ఒక ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడతను. అందులో వెన్నెల కిషోర్.. రఘుబాబు తదితరులున్నారు. 

ఈ ఫొటోలోనే కాదు.. సినిమాలోనూ బ్రహ్మి లేడట. బ్రహ్మి వల్లే సినిమాలు రొటీన్ అవుతున్నాయి అని ఆయన్ని పక్కన పెట్టేసినట్లున్నాడు వైట్ల. అటు త్రివిక్రమ్ కూడా బ్రహ్మి విషయంలో అదే చేస్తున్నాడు. డైరెక్టర్స్ బ్రహ్మికి రొటీన్ పాత్రలు ఇచ్చి ఆయన కెరీర్‌ను పక్కదోవ పట్టించేసి.. ఇప్పుడు ఆయన కామెడీని నెగెటివ్ సెంటిమెంటుగా భావించి పాత్రలివ్వకపోవడం బ్రహ్మి అభిమానుల్ని బాధిస్తోంది.

End of road for Brahmi?:

Shocking Reasons Behind Brahmanandam Not Getting Chances In Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs