Advertisement
Google Ads BL

మరోసారి సాయి ధరమ్ తో ఆ హీరోయిన్నే!


ఇప్పటి వరకు మాస్ చిత్రాల వెంట పడి కెరీర్ లో బాగా దెబ్బ తిన్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్... లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ కరుణాకరన్ డైరెక్షన్ లో ఒక తేజ్ ఐ లవ్యూ అనే ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నాడు. మరి మాస్ అనే మూసలో కొట్టుకుపోతున్న సాయి ధరమ్ తేజ్ లవర్ బాయ్ అవతారం ఎత్తి ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ నిలదొక్కుకోవాలని డిసైడ్ అయ్యాడు. అనుపమ పరమేశ్వరన్ తో కలిసి తేజ్ ఐ లవ్యూ లో సాయి ధరమ్ నటిస్తున్నాడు. చక్కటి ట్రెడిషనల్  లుక్స్ తో అనుపమ ఇంతవరకు చేసిన సినిమాల్లో బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు తేజ్ ఐ లవ్యూ లో కూడా సాయి ధరమ్ అండ్ అనుపమల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందని అంటున్నారు చిత్ర బృందం.

Advertisement
CJ Advs

మరి ఆ సినిమాలో వారి మధ్యన ఎలాంటి కెమిస్ట్రీ ఉందో మనకు క్లారిటీ లేదుగాని... ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే సాయి ధరమ్, అనుపమలు నటించిన  తేజ్ ఐ లవ్యూ ఇంకా విడుదల కాకుండానే మళ్ళీ సాయి ధరమ్, అనుపమలు కలిసి మరో సినిమాని ఒప్పుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే సాయి, అనుపమ కలిసి నటించే సినిమా అగ్రిమెంట్ పనులు కూడా ప్రారంభమయ్యాయట. ఆన్ స్క్రీన్ పై వీరిద్దరి కెమిస్ట్రీ సూపర్బ్ గా ఉందని...  దర్శకుడు కిషోర్ తిరుమల రీసెంట్ గా.. సాయి ధరమ్ తేజ్- అనుపమ కాంబినేషన్ లో మూవీ తీసే విషయమై వీరిని సంప్రదించాడట.

అయితే కిషోర్ తిరుమల చెప్పిన స్టోరీ లైన్ నచ్చిన సాయి ధరమ్ మరియు అనుపమలు వెంటనే ఈ సినిమా చేసేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈసినిమాలో సాయి ధరమ్ కేరెక్టర్ తో పాటుగా అనుపమ పరమేశ్వరన్ కేరెక్టర్ కూడా కొత్తగా ఉంటుందని.. అందుకే వీరు వెంటనే ఈ ప్రాజెక్ట్ కి ఒకే చెప్పారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఎంతగా నచ్చకపోతే... వీరిద్దరూ మళ్ళీ మళ్ళీ కలిసి నటించడానికి ఒప్పుకుంటారు.

Anupama one more with Sai Dharam Tej:

Sai Dharam Tej to romance with Anupama Parameswaran Once Again
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs