Advertisement
Google Ads BL

పాత జోక్‌ వేసి నవ్వుల పాలైన నాగ్‌!


నాగార్జునకి మంచి సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉంది. అది ఆయన ప్రసంగాలలోనే కాదు 'మాటీవీ'లో వచ్చిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోలో కూడా మనం గమనించవచ్చు. ఇక తాజాగా 'మహానటి' విడుదలైంది. దాంతో నేటితరం వారు సావిత్రి, జెమినిగణేషన్‌కి చెందిన పలు విశేషాలను సేకరిస్తున్నారు. ఇక కెవిరెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, ఎస్వీఆర్‌, సావిత్రి వంటి మహామహులు నటించిన 'మాయాబజార్‌' లోని మాయా దర్పణం సీన్‌ని నాగార్జున సైతం మరోసారి చూశాడు. 

Advertisement
CJ Advs

భారతీయులు 1957లోనే ల్యాప్‌టాప్‌ని కనుగున్నారని, దానికి వైఫై, వీడియో చాటింగ్‌లు కూడా ఉన్నాయని నాగ్‌ పోస్ట్‌ చేశాడు. అలనాటి మహత్తర పౌరాణిక చిత్రం 'మాయాబజార్‌'లో భాగంగా తీసిన ఓ సీన్‌ని ఆయన పోస్ట్‌ చేస్తూ డోంట్‌మిస్‌ ఇట్‌ అని పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోలో 'మాయాబజార్‌' చిత్రంలోని శశిరేఖగా సావిత్రి నటించి, మనసులోని కోరికలను చూపే ప్రియదర్శిని ముందు తీసిన సీన్‌, ఆపై వచ్చే 'నీవేనా నను తలచితివి' సాంగ్‌ కూడా ఉన్నాయి. 

నాగ్‌ చెప్పింది నిజమే అయినా, గతంలోనే ఎంతోకాలం ముందు ఇలాంటి వీడియోనే సోషల్‌ మీడియాలో ఒకటి కనిపిస్తోంది. యూట్యూబ్‌లో దీనిని మనం వినవచ్చు. అది మూడేళ్ల కిందట అప్‌లోడ్‌ చేసిన వీడియో కావడం గమనార్హం. దాంతో తన సెన్సాఫ్‌ హ్యూమర్‌తో నవ్వించాలని చూసిన నాగ్‌ నవ్వులపాలయ్యాడని మాత్రం చెప్పవచ్చు. ఇక నాటి కెవిరెడ్డి తీసిన ఈ 'మాయాబజార్‌' చిత్రం ఇప్పటికీ అద్భుతమైన కళాఖండంగానే నిలిచిపోయి ఉంది. అలాంటి స్క్రీన్‌ప్లే, సంగీతం, నటీనటుల నటన, సినిమాటోగ్రఫీతో పాటు అన్ని క్రాఫ్ట్‌ల మేలిమి కలయికగా ఈ చిత్రాన్నిచెప్పుకోవచ్చు. 

Nagarjuna posted Mayabazar Priyadarshini Video:

Nagarjuna tweets about Mayabazar scene; 1st laptop with wifi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs