Advertisement
Google Ads BL

మెగాడాటర్‌ సరిగ్గా అనాలసిస్‌ చేసింది!


యాంకర్‌, హోస్ట్‌, తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో హీరోయిన్‌.. మరోవైపు వెబ్‌సిరీస్‌లు ఇలా బహుముఖప్రజ్ఞను చాటుతున్న మెగాడాటర్‌ కొణిదెల నిహారిక. ఈమె సినీరంగ ప్రవేశాన్ని అందరు ప్రశంసిస్తూ కేవలం కొడుకులే వారసులా? కూతుర్లు వారసరాళ్లూ కాకూడదా? ఈ విషయంలో టాలీవుడ్ పరిశ్రమ బాలీవుడ్‌, కోలీవుడ్‌లను ఎందుకు ఆదర్శంగా తీసుకోవడం లేదు...అనేది చర్చకు వస్తోంది. మెగాహీరోలు ఎంత దూరపు బంధువులనైనా తమ ఓన్‌ చేసుకునే మెగాభిమానులు ఇప్పటికే సాయిదరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌, త్వరలో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌, సాయిధరమ్‌తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌తేజ్‌లను ఆదరించడానికి రెడీగా ఉన్నా వారు మెగా డాటర్‌ని ఎందుకు పట్టించుకోవడం లేదనేది చర్చించాల్సిన విషయం. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే తాజాగా నిహారిక మెగా ఫ్యామిలీలోని పలువురు హీరోలను తాను ఏ విషయంలో స్ఫూర్తిగా తీసుకుంటుందో చెప్పుకొచ్చింది. మంచి ఫలితం రావాలంటే ఎంతైనా సరే హార్డ్‌వర్క్‌ చేయాల్సిందే. విజయానికి షార్ట్‌ కట్స్‌ లేవని మెగాస్టార్‌ చిరంజీవి నుంచి నేర్చుకున్నానని, ఇక ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా, ఎలాంటి సమస్యనైనా చిరునవ్వుతో పోగొట్టవచ్చు అనేది నాన్ననుంచి నేర్చుకున్నానంది. 

యాక్టివ్‌గా, చైతన్యంగా ఉండటం అనేది పవన్‌కళ్యాణ్‌ని చూసి, ఫ్యామిలీకి మొదటి ప్రాధాన్యం ఇవ్వడం అనేది రామ్‌చరణ్‌ నుంచి, కోపం ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రదర్శించాలనే విషయాన్ని వరుణ్‌తేజ్‌ నుంచి, మనకంటే చిన్నవారిని ఎలా చూసుకోవాలి? అనే విషయాన్నిసాయిధరమ్‌తేజ్‌ నుంచి, అంకిత భావం అనేది అల్లుఅర్జున్‌ని చూసి, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఎలా ఉండాలి అనేది అల్లు శిరీష్‌ నుంచి నేర్చుకున్నానని నిహారిక తెలిపింది.ఇలా మెగాహీరోలలోని ప్రతి ప్రత్యేకమైన క్వాలిటీని నిహారిక అద్భుతంగా చెప్పిందనే అనుకోవాలి.

What Does Niharika Say about Mega Heroes?:

Niharika's Interesting Comments on Mega Heroes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs