Advertisement
Google Ads BL

అనసూయ అస్సలు తగ్గడం లేదు!


వ్యక్తిగతంగా అనసూయని ఆమె మాట్లాడే తీరును, ఆమె వేసే డ్రస్‌లు, ఇతర విషయాలపై ఆమెని ద్వేషించేవారు కూడా యాంకర్‌గా, ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఆమెలోని గ్లామర్‌ని చూసి ముచ్చట పడుతారు. 'జబర్ధస్త్‌' వంటి షోలలో కనిపిస్తూనే సినిమాలలోకూడా వరుస అవకాశాలు చేజిక్కించుకుంటోంది. నాడు 'అత్తారింటికి దారేది'లో అవకాశం వచ్చినా అందులో గుర్తింపు లేని పాత్ర, ఐటం నెంబర్‌ కోసం కావడంతో నో చెప్పింది. ఆ తర్వాత ఈమె 'క్షణం' చిత్రంలో తననటనతో మంచిమార్కులు కొట్టేసింది. 'సోగ్గాడే చిన్నినాయనా'తో మెప్పించిన ఈమె 'విన్నర్‌' చిత్రంలో మాత్రం కేవలం ఐటం పాటకే పరిమితం అయింది. కేవలం తన పేరు మీద పాట రాయడంతోనే ఆ చిత్రంలో నటించానని చెప్పుకొచ్చింది. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా ఆమె రామ్ చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం' చిత్రంలో రంగమ్మత్తగా అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌ అందించింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర కూడా బాగా రెస్పాన్స్‌ తెచ్చుకుంటూ ఉండటంతో మేకర్స్‌ కూడా ఆమె కోసం సరికొత్త పాత్రలను రాస్తూ, తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె 'సచ్చిందిరా గొర్రె' అనే డార్క్‌ కామెడీ చిత్రంలో నటిస్తోంది. ఇక 'వేరీజ్‌ వెంకటలక్ష్మి' చిత్రంలో కూడా ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఇక తాజాగా ఈమె దిల్‌రాజు నిర్మాతగా, అనిల్‌రావిపూడి దర్శకత్వంలో వరుసగా 'పటాస్‌, సుప్రీం, రాజా ది గ్రేట్‌' చిత్రాల ద్వారా హ్యాట్రిక్‌ పూర్తి చేసిన ఆయన వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌లతో తెరకెక్కించనున్న చిత్రంలో కూడా అనసూయ ఎంతో కామెడీ నిండిన ఓ పల్లెటూరి అమ్మాయిపాత్రలో నటించనుందని సమాచారం.

అనిల్‌ రావిపూడి అంటే జంధ్యాల, ఈవీవీ తర్వాత సింపుల్‌ కథలను కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా తెరకెక్కించే దర్శకుని చిత్రంలో ఈమె నటిస్తుండటం అదృష్టమనే చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఈమె మరెన్నిఅవకాశాలను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

Anasuya Busy with Movies:

Anasuya signs One More Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs