Advertisement
Google Ads BL

క్రిష్‌ సన్నద్దం అవుతున్నాడు..!


మహాభారతం.. ఇదో మహాసముద్రం. ఎందరు దీని గురించి చెప్పినా ఎన్నో చెప్పని అంశాలు ఉంటాయి. తలా చెంబుడు నీటిని మాత్రమే ఈ మహాసముద్రం నుంచి తీసుకోగలరు. ఇక ఇప్పటికే మహాభారతం పలు సార్లు టివీ సీరిస్‌గా వచ్చాయి. ఇక రాజమౌళి నుంచి ముఖేష్‌ అంబాని, సల్మాన్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌, మోహన్‌లాల్‌, నాగార్జున వంటి వారందరు ఈ చిత్రంలో నటించాలని ఆశపడుతున్న వారే. ఇక కన్నడలో 'కురుక్షేత్ర' పేరుతో దర్శన్‌ హీరోగా ఈ మహాభారతం ఓ మల్టీస్టారర్‌గా నిర్మిస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇక రాజమౌళి ప్రస్తుతం తాను ఈ చిత్రాన్ని తీయలేనని, పదేళ్ల తర్వాత దానిని చేస్తానని, తనకు ఇప్పుడే దానిని తీయడం సాధ్యం కాదని, నా అనుభవం దానికి సరిపోదని చెప్పాడు. అయితే మరోపక్క తెలుగు పరిశ్రమ గర్వించదగ్గ మరో దర్శకుడు క్రిష్‌ 'గౌతమీ పుత్రశాతకర్ణి'ని కేవలం 80రోజుల లోపే తక్కువ బడ్జెట్‌తో అద్భుతంగా తీశాడు. ప్రస్తుతం ఆయన కంగనారౌనత్‌ ప్రధాన పాత్రలో రాణి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవిత చరిత్రను 'మణికర్ణిక'గా తీస్తున్నాడు. కంగనాకు గాయం కావడం వల్ల ఈచిత్రం ఆగష్టులో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇక ఈ చిత్రం తర్వాత కన్నడ రచయిత భైరప్ప రాసిన 'పర్వా' నవల ఆధారంగా ఈ మహాభారతాన్ని క్రిష్‌ చేయాలని భావిస్తున్నాడట. 

ఈ నవల రెగ్యులర్‌ ఫార్మాట్‌లో కాకుండా సోషల్‌ ఎలిమెంట్స్‌తో ఉంటుంది. భారతంలోని పాత్రలు నేటి సమాజంలోకి వస్తే ఎలా ఉంటుంది?అనే పాయింట్‌ ఆధారంగా ఈనవల రూపొందింది. దీనిని క్రిష్‌ చదవి ఎంతో ఇన్‌స్పైర్‌ అయి ఈచిత్రం స్క్రిప్ట్‌ని తయారు చేస్తున్నాడని సమాచారం. గతంలో 'మాయాబజార్‌'ని కూడా దాసరి ఏయన్నార్‌, సుమన్‌, ఆమని వంటి వారితో 'మాయాబజార్‌'ని సాంఘీకరించినా అది ఆడలేదు. మరిక్రిష్‌ ఈ చిత్రాన్నిఎలా తీస్తాడో చూడాలి....!

Director Krish to direct Mahabharata based film:

Krish Wants To Direct Mahabharat After Manikarnika Movie  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs