Advertisement
Google Ads BL

త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీ ప్యాకేజ్ అదిరింది!


త్రివిక్రమ్ కి గత సినిమా అజ్ఞాతవాసి ఎంతలాంటి డిజాస్టర్ మిగిల్చినప్పటికీ.. ప్రస్తుతం త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. రాయలసీమ బ్యాక్  డ్రాప్ లో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ మరో రెండు రోజుల్లో టైటిల్ తో పాటుగా ఎన్టీఆర్ లుక్ కూడా విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ లుక్ ని చిత్ర బృందం విడుదల చెయ్యనుంది. డీజే భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో కనబడబోతున్నాడనే టాక్ ప్రచారంలో ఉంది. షూటింగ్ మొదలుపెట్టుకున్న కొద్ది రోజులకే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని సెకండ్ షెడ్యూల్ ని కూడా శరవేగంగా పూర్తి చేసుకుందీ చిత్రం.

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ టైటిల్ అండ్ ఎన్టీఆర్ లుక్ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. మరో పక్క త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మూవీ యూఎస్ హక్కులు రికార్డు ప్రైస్ కి అమ్ముడు కావడం హాట్ టాపిక్ గా మారింది. హారిక అండ్ హాసిని బ్యానర్ లో తెరకెక్కుతోన్న ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా యూఎస్ హక్కులకు దాదాపుగా 12 కోట్లు పలికాయని అంటున్నారు. అయితే హారిక అండ్ హాసిని బ్యానర్ ఓనర్ రాధాకృష్ణ ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమాతో పాటుగా... తమ బ్యానర్ లో తెరకెక్కుతోన్న మరో మూవీ సుధీర్ వర్మ - శర్వానంద్ ల సినిమాలను కలిపి ప్యాకేజ్ గా యూఎస్ హక్కులను 18 కోట్ల రూపాయలకు విక్రయించినట్లుగా తెలుస్తోంది.

అయితే శర్వానంద్ - సుధీరవర్మల సినిమాకి 6 కోట్ల లెక్కన, ఇక  ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ సినిమాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ 12 కోట్లు ముట్టినట్టు చెబుతున్నారని తెలుస్తోంది. మాములుగా త్రివిక్రమ్ సినిమాలకు ఓవర్సీస్ లో భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే త్రివిక్రమ్ గత సినిమాల ప్లాప్ ని పరిగణనలోకి తీసుకోకుండా త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాకి 12 కోట్లు ఓవర్సీస్ హక్కులకు వచ్చాయని అంటున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ సినిమా దసరాకి విడుదల చేయనున్నారు.

Jr NTR and Trivikram Movie Overseas Rights Creates New Records:

First look of Jr NTR, Trivikram film to be unveiled on the actor’s birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs