Advertisement
Google Ads BL

ఆత్మహత్యాయత్నం కాదు: రాజసింహ!


'రుద్రమదేవి' సినిమాలో అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి పాత్రకు డైలాగ్ రైటర్ గా పని చేసిన 'రాజసింహ'.. గురువారం ఆత్మహత్యాయత్నం చేశాడని సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు ప్రసారం జరిగాయి. రాజసింహ.. రుద్రమదేవి, అనగనగా ఓ ధీరుడు వంటి సినిమాలకు డైలాగ్స్ రాయడమే కాదు... సందీప్ కిషన్ హీరోగా ఒక్క అమ్మాయి తప్ప అనే సినిమాకి దర్శకత్వం కూడా వహించాడు. అయితే ఆ ఒక్క అమ్మాయి తప్ప ప్లాప్ అవడం.. చేతిలో అవకాశాలు లేని రాజసింహ బాగా డిప్రెషన్ కి లోనై ముంబైలో ఆత్మహత్యకి ప్రయత్నం చేశాడనే న్యూస్ బాగా వైరల్ అయ్యింది.

Advertisement
CJ Advs

అయితే తన ఆత్మహత్య వార్తలపై స్వయంగా రాజసింహ స్పందించాడు. తాను ఆత్మహత్యాయత్నం చేశానని వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరగడంతో స్పృహ తప్పి పడిపోయానని... అయితే నేను స్పృహ తప్పిన టైం లో తనకి దగ్గర్లో ఎవరు లేకపోవడంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్లడం.... ఆతర్వాత తనని వేరెవరో ఆస్పత్రిలో జాయిన్ చెయ్యడం జరిగింది కానీ.. నేనేమి సూసైడ్ ఎటెంప్ట్ చెయ్యలేదని ఒక వీడియో బైట్ ద్వారా స్పష్టతనిచ్చాడు.  అలాగే ప్రస్తుతం తనకి షుగర్ లెవెల్స్ బాగున్నాయని.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుపడిందని చెప్పిన రాజసింహ... రెండు మూడు రోజుల్లో తాను హైదరాబాద్ కి వస్తానని మరి చెప్పాడు.

Director Rajasimha Gives Clarity on Suicide Rumours:

Director Rajasimha Released A Video About His Suicide Rumours
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs