రాంగోపాల్‌వర్మ తానేమీ సచ్చరిత్రుడిని కాదని, తనకి ఏ చిత్రంలోనైనా నచ్చినసీన్, కథ ఉంటే కాపీ కొడతానని ఎప్పుడో ప్రకటించాడు. ఇక ఆ మధ్య వర్మఇద్దరు దర్శకద్వయానికి సినిమా దర్శకత్వం బాధ్యతలను అప్పగించి, పరిటాల రవి చరిత్ర తెరకెక్కించాలని భావించి, చివరకు వారు తీసిన చిత్రానికి తన పేరు వేసుకుని 'రక్తచరిత్ర1, 2'లుగా విడుదల చేశాడు. ఇటీవల వెబ్‌సిరీస్‌గా వచ్చిన 'జీఎస్టీ' విషయంలో కూడా ఆయన జయకుమార్ అనే రచయిత కథని కాపీ కొట్టాడని ఆరోపణలు వచ్చాయి.
తాజాగా వర్మ నాగార్జునతో తీస్తున్న 'ఆఫీసర్' చిత్రం కథ కూడా తనదేనని జయకుమార్ ఆరోపిస్తున్నాడు. ఈయన మాట్లాడుతూ, నాపేరు జయకుమార్. రాంగోపాల్‌వర్మ 'సర్కార్3'కి రచయితగా పనిచేశాను. ఓ సారి వర్మకి ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల కథ చెప్పాను. కానీ అందులో మార్పులు చేర్పులు చేయాలని వర్మ కోరడంతో ఆయా మార్పులు చేసి ఆయనకు మెయిల్ ద్వారా స్క్రిప్ట్‌ని పంపించాను. ఆయన ఈ చిత్రం విషయంలో తనకు కాంపెన్సేషన్, క్రెడిట్ ఇస్తానని మాట ఇచ్చాడు కానీ ఈయన ఇప్పటివరకు వాటిని నాకు ఇవ్వలేదు. 2015లో నాకు వర్మ పరిచయం అయ్యాడు. అదే ఏడాది జనవరిలో 'ఆఫీసర్' కథ ఆయనికి చెప్పానని తెలిపాడు. వర్మ కాపీ కొట్టిన మరోకథపై హైదరాబాద్ సివిల్‌కోర్టులో కేసు వేశానని, తన చిత్రాన్ని'ఆఫీసర్'లో నిసిగ్గుగా కాపీ కొట్టడం తనకు ఎంతో బాధను కలిగించిందని, నా అనుమతి, నా హక్కులు ఉల్లంఘించి వర్మ ఇలా తన సినీ జీవితాన్ని నాశనం చేశాడని, ఈ విషయంలో సినీ పెద్దలు ముందుకు వచ్చి నాకు న్యాయం చేయాలని ఆయనకోరాడు.
ఇక 'ఆఫీసర్' చిత్రంపై ముంబై కోర్టు కూడా స్టే విధించింది. వర్మ ఓ సంస్థకు చెల్లించాల్సిన మొత్తం చెల్లించకపోవడం, కోర్టు ఆదేశాలను కూడా బేఖారత్తు చేసి కోర్టుకి హాజరుకాకపోవడంతో ఈచిత్రంపై ఇక బిజినెస్ జరపరాదని, డిజిటల్ హక్కులతో సహా వేటిని అమ్మకూడదని 'ఆఫీసర్'పై కోర్టు స్టే విధించింది. దాంతోనే ఈచిత్రం విడుదల మే 25వ తేదీ నుంచి జూన్1కి వాయిదా వేశారని సమాచారం.