Advertisement
Google Ads BL

అఖిల్ హీరోయిన్ కి అక్కడ కలిసొస్తుంది..!


అఖిల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సయేశా సైగల్ కి ఆ సినిమా ఎలాంటి పేరుని తెచ్చిపెట్టలేదు... సరికదా.. ఇక టాలీవుడ్ లో అవకాశాలు అనేవి లేకుండా పోయాయి. అఖిల్ సినిమా దెబ్బకి అఖిల్ ఎంతగా టెన్షన్ పడ్డాడో... సయేశా కూడా అంతే టెన్షన్  పడింది. అయితే సయేశా కి కాస్త కోలీవుడ్ లో ఊరట దొరికింది. కోలీవుడ్ లో కొన్ని ప్లాపులు ఎదుర్కొన్నప్పటికీ.. సయేశా కున్న హాట్ యాంగిల్ ఆమెకు బాగానే అవకాలు కలిపిస్తున్నాయి. ప్రస్తుతం కార్తీ సినిమాలో నటిస్తున్న సయేశా... ఆర్య, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బాగా బిజీ తారగా మారింది. సయేశావి ప్రస్తుతం 3 భారీ చిత్రాలు సెట్స్ పై ఉండగా.. ఇవన్నీ కూడా ఈ ఏడాదే థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నాయి.

Advertisement
CJ Advs

ఇక కార్తీ సరసన కడైకుట్టి సింగం లో నటిస్తున్న సయేశా ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కి ఎంపికయ్యిందనే న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో వినబడుతుంది. అది కూడా కార్తీ అన్న స్టార్ హీరో సూర్య సరసన సయేశా ఛాన్స్ కొట్టేసిందని న్యూస్ హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో ఎన్ జి కె సినిమాలో నటిస్తున్న సూర్య ఆ  సినిమా తరువాత కె వి ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో కోలీవుడ్ నుండి అనేకమంది హీరోయిన్స్ ని పరిశీలించారట.

అయితే ప్రస్తుతం మూడు బిగ్ ప్రాజెక్టులతో బిజీగా వున్నా సయేశా అయితే మంచి క్రేజ్ ఉంటుందని భావించి ... సూర్య సరసన సయేశా ని ఎంపిక చేశారట. అయితే భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సూర్య సరసన సయేశా నటిస్తుండగా... మలయాళీ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలోనూ....  టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ మరో  కీలక పాత్రలలో కనిపించనున్నారట. ఇక తెలుగులో క్రేజ్ చూపించలేకపోయిన సయేశా తన అందాల ఆరబోతతో.. కోలీవుడ్ లో మాత్రం బాగానే సెటిల్ అయ్యింది. ప్రస్తుతం హీరోలందరికీ బెస్ట్ ఆప్షన్ గా సయేశా మారింది అంటే... కోలీవుడ్ లో ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్ధమవుతుంది.

Sayesha Saigal in Suriya's 37th film:

Akhil Heroine Sayesha Saigal Busy in Kollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs