Advertisement
Google Ads BL

సమంత ఆటోలో.. 'యూటర్న్‌'!


పెళ్లయిన తర్వాత సమంత కెరీర్‌ మరింత స్పీడును అందుకుంది. వరస విజయాలతో పెళ్లయిన తర్వాత హీరోయిన్లను సరిగా ఆదరించరనే టాక్‌కి ఆమె చెక్‌ చెప్పింది. తనమామగారితో చేసిన 'రాజు గారి గది2' చిత్ర విజయం పక్కనపెడితే ఇందులో సమంత పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక 'రంగస్థలం' చిత్రంలో పల్లెటూరి రామలక్ష్మిగా ఆమె కిస్‌ సీన్‌ చేసినా ప్రేక్షకులు ఆమెని నెత్తిమీద పెట్టుకున్నారు. ఇక దాని వెంటనే 'మహానటి' చిత్రంలో మధురవాణి పాత్రతో క్లైమాక్స్‌లో ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించింది. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా తమిళంలో విడుదలైన విశాల్‌ చిత్రం 'ఇరుంబుదిరై' చిత్రంలో రతీదేవిగా తన పాత్రకు జీవం పోసింది. త్వరలోఈ చిత్రం తెలుగులోకి 'అభిమన్యుడు'గా రానుంది. ఇలా వరస హ్యాట్రిక్స్‌ అందించిన సమంత ప్రస్తుతం 'యూటర్న్‌' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కన్నడనాట విడుదలై ఘనవిజయం సాధించడంతో ఈ చిత్రాన్నిఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో సమంత చేస్తోంది. కన్నడ ఒరిజినల్‌కి దర్శకత్వం వహించిన పవన్‌కుమారే తెలుగు, తమిళ భాషలకు దర్శకునిగా పనిచేస్తున్నాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. 

ఇందులో సమంత ఆటో ఎక్కిన స్టిల్‌ ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇక ఈ చిత్రంలో భూమికతో పాటు ఆదిపినిశెట్టి కూడా కీలకపాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం కోసం సమంత భారీ రెమ్యూనరేషన్‌ తీసుకుందని అంటుంటే.. ఆమె స్వయంగా ఈ చిత్రం నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తోందని కూడా అంటున్నారు. మరి ఈరెండింటిలో ఏది నిజమో తెలియాలంటే కొంతకాలం వెయిట్‌ చేయకతప్పదు. 

U Turn Pic : Samantha in auto:

Samantha Akkineni's latest still from the film U Turn
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs