Advertisement
Google Ads BL

'నేల నాకించేస్తారు'- రవితేజ మార్క్ ట్రైలర్..!


'బెంగాల్‌ టైగర్‌' చిత్రం తర్వాత ఎంతో గ్యాప్‌ తీసుకున్నరవితేజ రీఎంట్రీగా దిల్‌రాజు నిర్మాతగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజా ది గ్రేట్‌' ద్వారా హిట్‌ కొట్టాడు. కానీ ఆ తర్వాత వచ్చిన పక్కామాస్‌ కమర్షియల్‌ చిత్రం 'టచ్‌ చేసిచూడు' దారుణ పరాజయాన్నిమిగిల్చింది. ఇలా రీఎంట్రీలో ఒక హిట్‌, ఒక ఫ్లాప్‌తో సమానంగా ఉన్నాడు మాస్‌మహారాజా రవితేజ. ఇక ప్రస్తుతం ఆయన 'సోగ్గాడే చిన్నినాయనా,రారండోయ్‌ వేడుక చూద్దాం' చిత్రాల ద్వారా వరుసగా రెంఢు హిట్స్‌ కొట్టిన దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ హ్యాట్రిక్‌ హిట్‌ కోసం 'నేల టిక్కెట్టు' చిత్రాన్ని తీశాడు. రామ్‌తాళ్లూరి నిర్మించగా మాళవికశర్మ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రం ఆడియో వేడుకకు పవన్‌కళ్యాణ్‌ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. నాడే ట్రైలర్‌ రిలీజ్‌ చేయాలని భావించినా వీలుకాలేదు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. 'ఫిదా' చిత్రానికి సంగీతం అందించిన శక్తికాంత్‌ కార్తీక్‌ అందించిన బాణీలు బాగా అలరిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్‌లో ఫైట్స్‌, డ్యాన్స్‌లలో రవితేజ ఇరగదీస్తున్నాడు. 'ఎంతమంది కష్టాలలో ఉన్నారో చూడరా...కానీ సాయం చేసేవాడు ఒక్కడులేడు' అని రవితేజ చెప్పిన డైలాగ్‌ ఉంది. ఇక ఇందులో రవితేజ వృద్దులకు సాయం చేస్తూ వారి తరపున పనిచేసే వాడిగా కనిపిస్తున్నాడు. ఇక విలన్‌గా జగపతిబాబు మరింత పవర్‌ఫుల్‌గా 'నేను ఎదగడానికి ఎంతమందినైనా తొక్కేస్తాను' అని పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెబుతున్నాడు. 

ఇక తనకి అచ్చివచ్చిన జోనరులో రవితేజ ఈ చిత్రంలోని పాత్రలో పరకాయప్రవేశం చేసినట్లు అనిపిస్తోంది. ముసలితనం అంటే చేతగాని తనం కాదురా. నిలువెత్తు అనుభవం. 'నేల టిక్కెట్టు గాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు' వంటి డైలాగ్స్‌ బాగున్నాయి. రామ్‌ తాళ్లూరి ఖర్చుకు వెనుకాడకుండా భారీగా ఈచిత్రాన్ని నిర్మించాడు. చూస్తుంటే సమ్మర్‌ ఎండింగ్‌లో మాస్‌మహారాజా రవితేజ 'నేలటిక్కెట్‌' రూపంలో మంచి పక్కామాస్‌ విజయం ఇవ్వడం గ్యారంటీ అనిపిస్తోంది. 

Click Here for Trailer

Raviteja Nela Ticket Trailer Released:

<h3 class="text-center"><span style="font-weight: normal;">Raviteja Nela Ticket Trailer Review</span></h3>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs