Advertisement
Google Ads BL

శ్రీకాంత్‌ అడ్డాల నుంచి మరో మల్టీస్టారర్‌!


ప్రస్తుతం ఉన్నయంగ్‌ హీరోలలో మినిమం గ్యారంటీ ఉన్న హీరోగా ఫెస్టివల్‌ హీరో శర్వానంద్‌ పేరు చెప్పుకోవచ్చు. కాగా ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం, దీని తర్వాత సుధీర్‌వర్మ దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. ఇక హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా రూపొందించనున్న కంటెంట్‌ ఓరియంటెడ్‌ చిత్రంగా రూపొందే మల్టీస్టారర్‌లో కూడా శర్వానంద్‌ నటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ చిత్రం నుంచి శర్వానంద్‌ డ్రాప్‌ అయ్యాడని తెలుస్తోంది. 

Advertisement
CJ Advs

ఇక ఈయన చేస్తున్న హనురాఘవపూడి, సుధీర్‌వర్మల చిత్రాలకు అన్ని రెడీ అయిపోతున్నాయి. ఇక విషయానికి వస్తే 'కొత్త బంగారులోకం'తో సంచలనం సృష్టించి, మల్టీస్టారర్స్‌కి 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'తో శ్రీకారం చుట్టి భారీ విజయాన్ని నమోదు చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. కానీ శ్రీకాంత్‌ అడ్డాల మీద నమ్మకంతో పీవిపీ బేనర్‌లో రూపొందిన 'బ్రహ్మోత్సవం' చిత్రం బాధ్యతలను పివిపి, మహేష్‌లు శ్రీకాంత్‌అడ్డాల చేతిలో పెట్టారు. కానీ ఈ చిత్రం డిజాస్టర్‌ అయింది. నాటి నుంచి శ్రీకాంత్‌ అడ్డాల అసలు వార్తల్లోనే లేడు. 

తాజాగా ఆయన ఓ కొత్తకథను తయారు చేసుకుని గీతాఆర్ట్స్‌ ద్వారా ఓకే చెప్పించుకున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రం అన్నదమ్ముల సెంటిమెంట్‌గా ఇద్దరు హీరోలతో రూపొందనుంది. ఈ కథ విన్న శర్వానంద్‌ అందులో ఓ హీరోగా తాను నటించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడట. మరి ఆ రెండో హీరో ఎవరో తెలిస్తే తెలుగులో శ్రీకాంత్‌ అడ్డాల చేతిలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' ద్వారా రెండో మల్టీస్టారర్‌కి తెరలేవడం ఖాయంగా కనిపిస్తోంది. 

Sharwanand Teams Up With Srikanth Addala:

Sharwanand signs Srikanth Addala Family entertainer film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs