Advertisement
Google Ads BL

మంచి నటిగా గుర్తింపు పొందాలి: ప్రమోదిని!


నటి ప్రమోదిని, బెంగుళూరులో పుట్టి పెరిగి బాలనటిగా చిత్రసీమలో అడుగు పెట్టి 40 చిత్రాలకు పైగా నటించి ఎన్నో అవార్డులు పొంది, కన్నడీయుల హృదయాలలో తనకంటూ ఒక్క స్థానం సంపాదించుకున్న నటి ప్రమోదిని ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. హీరో నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయం అయిన ప్రమోదిని, వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఆక్సిజన్, నిర్మల కాన్వెంట్, ధృవ, రెండు రెళ్ళ ఆరు, అందగాడు, లై, కిరాక్ పార్టీ, నా పేరు సూర్య వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇటీవలే విడుదలైన 'మెహబూబా' చిత్రంలో హీరో పూరి ఆకాష్ కి తల్లి పాత్రలో నటించి మెప్పించారు. తనకు ఇంత మంచి పాత్ర ఇచ్చిన పూరి జగన్నాధ్ గారికి తన కృతఙ్ఞతలు తెలియజేసారు.

Advertisement
CJ Advs

మరి ఇన్ని మంచి చిత్రాలలో నటించి మెప్పించిన ప్రమోదిని మాట్లాడుతూ... నేను కన్నడ నటిని, బాలనటిగా 40 కి పైగా చిత్రాలు చేశాను. క్లాసికల్ భరతనాట్యం డాన్సర్ ని. మా అమ్మ గారి ప్రోత్సాహంతో బాలనటిగా కన్నడలో 'తవ్వారు మని' అనే చిత్రంతో నా కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో చిత్రాలు చేశాను, మంచి గుర్తింపు తెచ్చుకున్నాను,  బాలనటిగా ఎన్నో అవార్డులు అందుకున్నాను. మణియే మంత్రాలయ,  హుళి హెబులి లాంటి ఎన్నో సూపర్ హిట్ కన్నడ చిత్రాల్లో నటించాను. తర్వాత పెద్దయ్యాక చదువు పూర్తిచేసుకుని ఉదయ టీవీలో యాంకర్ గా పని చేశాను. అలాగే కన్నడ సీరియల్ లో కూడా నటిగా పనిచేసాను. ఒక సీరియల్ లో నా నటన చూసి దర్శకేంద్రులు కె రాఘవేంద్ర గారు తెలుగు సీరియల్ మనో యజ్ఞంలో ఆఫర్ ఇచ్చారు. అలా తెలుగులో నా ప్రస్థానం ప్రారంభం అయింది. తర్వాత పెళ్లి చేసుకుని నా భర్తతో అమెరికాలో సెటిల్ అయిపోయాను. 5 ఏళ్ళు హౌస్ వైఫ్ గా ఉన్నాను కానీ నటించాలి అనే  కోరిక నన్ను తిరిగి హైదరాబాద్ కు రప్పించింది. ఎలాగైనా సినిమాలో నటించాలి అని సినిమా ఆఫీసులు చుట్టు తిరిగాను. చివరికి డైరెక్టర్ హను రాఘవపూడి గారు 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. 14 రీల్స్ బ్యానర్ వాళ్ళకి మరియు డైరెక్టర్ హను రాఘవపూడి గారికి ధన్యవాదాలు. తర్వాత ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అందగాడు, లై సినిమాలు చేసాను. తర్వాత డైరెక్టర్ సురేంద్ర రెడ్డి గారు నాకు  రామ్ చరణ్ గారి సినిమా 'ధృవ' లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అంత గొప్ప సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చిన సురేంద్ర రెడ్డి గారికి నా కృతఙ్ఞతలు. ఇలా వరుసగా మంచి మంచి సినిమాలు చేశాను. 

రీసెంట్ గా రిలీజ్ అయినా మెహబూబా సినిమా నాకు చాలా మంచి పేరు తెచ్చింది. పూరి గారు నాకు మంచి బ్రేక్ ఇచ్చారు. పూరి గారిని నా గురువుగా భావిస్తున్నాను. ఇంత  మంచి సినిమా ఇచ్చిన పూరి గారికి నేను ఎప్పటికి రుణపడి ఉంటాను. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు నన్ను ఒక యంగ్ మదర్ గా పొగుడుతుంటే నాకు చాలా సంతోషం వేసింది. 

ఇప్పుడు హీరో రాజ్ తరుణ్ నటించిన 'రాజుగాడు' చిత్రంలో హీరోయిన్ మదర్ రోల్ చేస్తున్నాను. చాలా  మంచి పాత్ర. తర్వాత, రాహుల్ రవీంద్రన్ హీరోగా నటిస్తున్న ద్రుష్టి సినిమాలో నటనకి మంచి స్కోప్ ఉన్న పాత్ర చేస్తున్నాను. తర్వాత రధం, హుషారు సినిమాలు చేస్తున్నాను. 

నాకు అందరు దర్శకులతో పని చేయాలనీ ఉంది. మంచి క్యారెక్టర్ లు చేయాలనీ మంచి పేరు తెచ్చుకోవాలని నా కోరిక.. అని అన్నారు.

Pramodini says Thanks to Puri Jagannadh:

Actress Pramodini Latest Interview 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs