Advertisement
Google Ads BL

అఖిల్ 3 కి 'తొలిప్రేమ' సెంటిమెంట్..!!


వరసనే రెండు డిజాస్టర్స్ తో అక్కినేని అఖిల్ తన మూడవ సినిమా ఎవరితో ఉంటుందని తన ఫ్యాన్స్  ఎంతో ఆత్రుతగా ఎదురు చూసారు. అందరు అనుకున్నట్టుగానే అఖిల్ ఓ హిట్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. 'తొలిప్రేమ' సినిమాతో వరుణ్ తేజ్ లో ఇంకో యాంగిల్ ని చూపించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి తన రెండో సినిమా అఖిల్ తో ఫిక్స్ అయ్యాడు.

Advertisement
CJ Advs

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది విభిన్నమైన ప్రేమకథాంశంతో రూపొందనుంది. అఖిల్ కు జోడిగా సీఎం లవర్ అనుకున్నారు. అదేనండి మహేష్ బాబు 'భరత్ అనే నేను' హీరోయిన్ కైరా అద్వానిని అనుకున్నారు. 

ఈ సినిమా మొదటి షెడ్యూలను ఈ నెల 29వ తేదీ నుంచి లండన్ లో ఆరంభించనున్నారు. కథ ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా లండన్ లోనే జరగనుంది. ఆల్రెడీ టీం లండన్ లోని కొన్ని లొకేషన్స్ ను లాక్ చేసింది. త్వరలోనే అఖిల్ అండ్ కైరా అద్వాని అక్కడికి వెళ్లనున్నారు. 'తొలిప్రేమ' సినిమా కొంత భాగం షూటింగ్ లండన్ లోనే షూట్ చేసారు. ఆ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. మళ్లీ ఇప్పుడు అదే సెంటిమెంట్ తో వెంకీ ఈ సినిమా షూటింగ్ అక్కడే షూట్ చేయనున్నారు. మరి సెంటిమెంట్ పరంగా చూసుకుంటే అఖిల్ సినిమా తొలిప్రేమలాగా హిట్ అందుకుంటాడేమో చూద్దాం.

Tholiprema Sentiment to Akhil 3rd Movie:

Akhil 3rd Film Shoot in London
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs