Advertisement
Google Ads BL

రాజమౌళి మల్టీస్టార్రర్ కి ఒక హీరోయిన్ ఫిక్స్!


తెలుగులో 'నేను శైలజ, నేనులోకల్‌' చిత్రాలతో ఎలాంటి గ్లామర్‌షో లేకుండా కీర్తిసురేష్‌ అందరికీ కట్టిపడేసింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన ధనుష్‌ చిత్రం 'తొడరి', 'గ్యాంగ్‌, అజ్ఞాతవాసి' వంటి చిత్రాలు ఆమెకి ఉన్నపేరును చెడగొట్టాయి. ఇక కేవలం నేటి హీరోయిన్స్‌ అంటే కేవలం గ్లామర్‌షో ద్వారా మాత్రమే ఇమేజ్‌ సాధిస్తామనే భ్రమలో ఉన్నారు. కానీ ఈ విషయాన్ని కీర్తిసురేష్‌, సాయిపల్లవి వంటి వారు తప్పు అని నిరూపిస్తున్నారు. ఇక 'మహానటి' చిత్రంలో సావిత్రి పాత్రకు కీర్తిసురేష్‌ ప్రాణం పోసింది. దీనిపై ఆమెపై పొగడ్తల జల్లు కురుస్తోంది. సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు అందరు ఆమెని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆమెని చూస్తుంటే సావిత్రినే కీర్తిసురేష్‌లోకి వచ్చి తన పాత్రలో నటింపజేసిందా? అనేంతగా ప్రశంసలు లభిస్తున్నాయి. దీంతో పాటు ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా సంచలన విజయాలను సాధిస్తోంది. నేడు ఎక్స్‌పోజింగ్‌ చేయకుండానే ఇంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కీర్తిసురేష్‌కే సాధ్యమని అంటున్నారు.

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రం చూసిన జక్కన్న.. దర్శకుడు నాగ్‌అశ్విన్‌, సావిత్రి పాత్రధారి కీర్తిసురేష్‌, జెమినిగణేషన్‌ పాత్రను పోషించిన దుల్కర్‌ సల్మాన్‌లపై ఏ స్థాయి పొగడ్తలు కురిపించాడో తెలిసిందే. తాను చూసిన బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ కేవలం కీర్తిసురేష్‌దేనని చెప్పుకొచ్చాడు. ఇక త్వరలో రాజమౌళి.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో పక్కామాస్‌, యాక్షన్‌, ఎమోషనల్‌ చిత్రంగా మల్టీస్టారర్‌ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. 

'మహానటి' తర్వాత మాత్రం ఆయన ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా కీర్తిసురేష్‌ని తీసుకోవాలని డిసైడ్‌ అయ్యాడట. మరి ఈమె రొమాన్స్‌ చేసేది ఎన్టీఆర్‌తోనా, లేక రామ్‌చరణ్‌తోనా? అనేది తేలాల్సివుంది. మరోవైపు రెండో హీరోయిన్‌గా, రాశి ఖన్నా, రష్మిక మందన్నల పేరు వినిపిస్తోంది. మరోవైపు కీర్తిసురేష్‌తో పాటు సాయిపల్లవిని కూడా తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. ఈ పక్కా మాస్‌ చిత్రంలో ఏమాత్రం ఎక్స్‌పోజింగ్‌ చేయని హీరోయిన్లతో రాజమౌళి ఎలా డీల్‌ చేయగలడు? అనేదే సందేహం.

Rajamouli Roped in Keerthi Suresh For A Multi-Starrer?:

SS Rajamouli Multistarrer Movie RRR Heroine is Keerthi Suresh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs