Advertisement
Google Ads BL

ఇక నా స్పీడ్ చూసుకోమంటోంది!


ఐశ్వర్యారాయ్‌కి పెళ్లయి బచ్చన్‌ ఫ్యామిలీ కోడలు అయినా క్రేజ్‌ తగ్గలేదు. తన పాప ఆరాధ్య పుట్టిన సమయంలో కాస్త గ్యాప్‌ ఇచ్చి తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టింది. ఇక వరుసగా కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో పదిహేడవసారి రెడ్‌ కార్పెట్‌పై నడవడం ద్వారా ఈమె సంచలనం సృష్టించింది. ఇక ఈసారి విశేషం ఏమిటంటే ఆమె రెడ్‌కార్పెట్‌పై నడిచేటప్పుడు ఆమె కూతురు ఆరాధ్య కూడా ఆమె పక్కన వాక్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షిచింది.ఇక ప్రస్తుతం ఐశ్వర్య వయసు 44ఏళ్లు కాగా, ఆరాధ్య వయసు 6ఏళ్లు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా ఐశ్వర్యాబచ్చన్‌ మాట్లాడుతూ నా కెరీర్‌లో నేను చాలా చిన్నపిల్లలా, స్కూల్‌ పిల్లలా వ్యవహరించాను, షెడ్యూల్స్‌ విషయంలో ఖచ్చితంగా ఉండే దానిని. దీంతో చాలా పెద్ద సినిమా ఆఫర్లు వచ్చినా కూడా డేట్స్‌ క్లాష్‌ వల్ల వదులుకున్నాను. ఇలా పలు మంచి ఆఫర్లు మిస్‌ అయ్యాయి. ఇకపై నేను అలా చేయను. సినిమాల విషయంలో మరింత ఉత్సాహంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. దూకుడును పెంచడానికి కావాల్సిన విధంగా షెడ్యూళ్లని మరింత బాగా వేసుకుంటాను. నాతోటి సహనటులందరూ ఏడాదంతా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు అని చెప్పుకొచ్చింది. 

ఇక తనకూతురు ఆరాధ్య లేకుండా తాను ఎక్కడికి వెళ్లనని, ఆమెని ఎవరికి వదిలివేయనని చెప్పుకొచ్చింది. ఇక ఈమె తాజాగా 1964లో వచ్చిన 'యే కౌన్‌థీ', 1967లో వచ్చిన 'రాత్‌ ఔర్‌దిన్‌' వంటి చిత్రాలకు ఓకే చెప్పింది. ఇక దేశంలో పెరిగిపోతున్న సరోగసీ విధానం, పేదరికం వల్ల అద్దె గర్భాలకు ఒప్పుకుంటున్న పలువురు స్త్రీల జీవితాల ఆధారంగా కూడా  'టాయిలెట్‌ ఏక్‌ ప్రేమ్‌కథా' తీసిన శ్రీనారాయన్‌ సింగ్‌ 'జాస్మిన్‌....స్టోరీ ఆఫ్‌ ఎ లీస్ట్‌ ఊంబ్‌' చిత్రంలో కూడా నటించే అవకాశం ఉంది. మొత్తానికి రానున్నరోజుల్లో ఐశ్వర్యారాయ్‌ వరుస చిత్రాలతో మరింత బిజీ కావాలని నిర్ణయించుకోవడం ఆమె అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించే విషయమే.

Aishwarya Rai gives an update about her Future Projects:

<h1 class="title style-scope ytd-video-primary-info-renderer">Aishwarya Rai Bachchan attends Cannes Film Festival&nbsp;</h1>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs