Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ కోసం రంభని దించుతున్నాడు..!


ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని సెకండ్ షెడ్యూల్ లో బిజీగా వుంది. మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించిన త్రివిక్రమ్ సెకండ్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ - హీరోయిన్ పూజ హెగ్డే పై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. నిన్నటివరకు ఎన్టీఆర్ సెట్స్ కి రాని పూజ ఇప్పుడు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా కోసం వచ్చేసింది. ఫ్యామిలీ నేపథ్యంలో రాయలసీమ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రివిక్రమ్ తన సినిమాల్లో ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇచ్చే సీనియర్ హీరోయిన్ ని ఇప్పుడు సెలెక్ట్ చేసినట్టుగా వార్తలొస్తున్నాయి. నిన్నటివరకు ఆ సీనియర్ హీరోయిన్ కేటగిరిలో లయ, మీనా పేర్లు గట్టిగా వినబడ్డాయి. కానీ తాజాగా ఈ లిస్ట్ లోకి ఒకప్పుడు హీరోయిన్ గా ఒక ఊపు ఊపి పెళ్లి చేసుకుని పిల్లల్తో సెటిల్ అయిన రంభని త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా కోసం సెలెక్ట్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి.

Advertisement
CJ Advs

త్రివిక్రమ్.. తన సినిమాల్లో మాజీ హీరోయిన్స్ కి మంచి కేరెక్టర్స్ ఇస్తుంటాడు. అందులోను మాజీ హీరోయిన్స్ కి తన సినిమాల్తో మళ్ళీ ప్రేక్షకులు మెచ్చేలా ఎంట్రీ ఇప్పిస్తుంటాడు. గతంలో.. నదియాని అత్తారింటికి దారేది సినిమాతోనూ, స్నేహని సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాతోనూ, ఖుష్బూ ని అజ్ఞాతవాసి తోనూ తన సినిమాల్లో కీలక పాత్రలు పోషించే అవకాశం ఇచ్చాడు. మరి ఇప్పుడు రంభ వంతు వచ్చింది. రంభ సినిమా అవకాశాలు తగ్గాక కూడా గతంలో రాజమౌళి - ఎన్టీఆర్ 'యమదొంగ', ఎన్టీఆర్ 'నాగ' సినిమాలలో స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టేసింది. మరి ప్రస్తుతం తన భర్త, పిల్లల్తో గడుపుతున్న రంభ జి ఛానల్ లో ఒక డాన్స్ షో కి జడ్జి గా వ్యవహరించింది.

మరి  ఇప్పుడు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలో అవకాశం నిజంగా రంభకి తగిలితే గనక ఇక రంభకి సెకండ్ ఇన్నింగ్స్ లో ఎదురే ఉండదు. మరి త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో రంభకు కీలకమైన పాత్రను ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన రావడమే కాదు... రంభ కూడా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకి త్వరలోనే హాజరవుతుందని తెలుస్తుంది.

Rambha in Jr NTR And Trivikram Movie:

Senior Heroine Ramba to play Important Role in Jr NTR and Trivikram Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs