Advertisement
Google Ads BL

రామ్ చరణ్, బోయపాటి.. ‘ఇంద్ర 2’..!


నాటి 'భాషా' నుంచి 'సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఆది, సాంబ, సింహాద్రి' ఇలా నాటి చిత్రాలు ఎన్నో ఫ్యాక్షన్‌, మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చాయి. వీటన్నింటి ఫార్ములా ఒకటే. ప్రస్తుతం హీరో ఏదో సింపుల్‌గా ఎవరికి తెలియకుండా బతుకుతూ ఉంటాడు. కానీ ప్లాష్‌బ్యాక్‌లో ఈయన అసామాన్యుడు. కొన్ని కారణాల వల్ల పాత జీవితానికి దూరంగా వర్తమానంలో సింపుల్‌గా బతికేస్తూ ఉంటాడు. కానీ ఆ ఫ్లాష్‌బ్యాక్‌ బయటికి రావడం, హీరో ధీరోధాత్తత అందరికీ తెలియడం, హీరో ఆ ఊరి వారినందరిని కాపాడటం ఇది స్టోరీలైన్‌. ఇప్పుడు బోయపాటి శ్రీను కూడా చరణ్‌తో ఇదే తరహా చిత్రం నిర్మిస్తున్నాడని, ఈ చిత్రం మెయిన్‌ పాయింట్‌ కూడా ఇదేనని తెలుస్తోంది. దాంతో కొందరు ‘ఇంద్ర 2’ తీస్తున్నారా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇక తాజాగా 'భరత్‌ అనే నేను' తీసి, త్వరలో రాజమౌళితో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ని తీయనున్న దానయ్య ఈ చిత్రం నిర్మాత కావడం విశేషం. ఇక ఈ చిత్రం ఒక షెడ్యూల్‌ హైదరాబాద్‌లో పూర్తి చేసుకుంది. 'రంగస్థలం' కనివినీ ఎరుగని విజయం సాధించడంతో ఈ చిత్రం కథలో చరణ్‌ కాస్త మార్పులు చేర్పులు చేయించాడట. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఇక్కడ వివేక్‌ ఒబేరాయ్‌, జగపతిబాబు, రామచరణ్‌లపై కొన్నియాక్షన్‌ ఎపిసోడ్స్‌, రామ్‌చరణ్‌, కైరా అద్వానీలపై కొన్ని పాటలను చిత్రీకరించనున్నారు. 

ఇక ఇందులో ప్రశాంత్‌, స్నేహ, శ్రీకాంత్‌ వంటి నటీనటులు కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. 

Ram Charan and Boyapati Movie Latest Update:

Is This Ram Charan and Boyapati Movie Story Line
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs