దర్శకునిగా విక్రమ్ కె.కుమార్‌కి ఇంటెలిజెంట్ డైరెక్టర్‌గా పేరుంది. ఆయన మొదటి ఇన్నింగ్స్‌లో తీసిన 'ఇష్టం' తరహా చిత్రాలను పక్కన పెడితే సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈయన తీసిన 'ఇష్క్, మనం, 24' వంటి చిత్రాలు విభిన్నమైన చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఇక తన మొదటి చిత్రం 'అఖిల్'తో డిజాస్టర్ అందుకున్న అక్కినేని చిన్నోడు అఖిల్‌ని ఆయన తండ్రి విక్రమ్ కుమార్ చేతుల్లో పెట్టి 'హలో' చిత్రాన్ని స్వయంగా తీశాడు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా కథ మరీ పాతకాలం నాటి కథ కావడం, 'మనసంతానువ్వే'కి లేటెస్ట్ వెర్షన్ అనే పేరు రావడంతో ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ కొట్టనున్నామని చెప్పిన నాగ్ మాటలు తారుమారయ్యాయి. ఈ చిత్రం కమర్షియల్‌గా ఫ్లాప్ అనిపించుకుంది.
అయినా ఈ 'హలో' చిత్రానికి టేకింగ్‌పరంగా, అఖిల్ లుక్స్‌పరంగా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇక ఈ చిత్రానికి స్టంట్ కొరియోగ్రఫీని హాలీవుడ్‌కి చెందిన హాలీవుడ్ స్టంట్‌మాస్టర్ బాబ్‌బ్రౌన్ అందించాడు. ఈ చిత్రంలోని యాక్షన్‌ఫీట్లు బాగానే ఉన్నా కథకి మాత్రం సింక్ కాలేదు. ఇక తాజాగా 'హలో' చిత్రం వరల్ట్ స్టంట్స్ ఇంటర్నేషనల్‌లో విదేశీ కేటగిరిలో నామినేషన్ పొంది అవార్డు పోటీలో నిలిచింది.
దీని గురించి విక్రమ్ కె.కుమార్ సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ నామినేషన్ నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా ఈ కేటగిరిలో ఎంపిక అయినందుకు సంతోషంగా వుంది. పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు. అఖిల్ హార్డ్‌వర్క్, ఆయన అంకిత భావం ఈ చిత్రాన్ని ఈ స్థాయిలో నిలిపాయి అని తెలిపాడు. ఇక అఖిల్ ప్రస్తుతం 'తొలిప్రేమ' దర్శకుడు వెంకీ అట్లూరితో చిత్రం చేస్తుండగా, విక్రమ్ కె. కుమార్ అల్లుఅర్జున్‌తో కలిసి ఓ చిత్రంలో పనిచేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఇది నామినేషన్‌తో సరిపెట్టుకుంటుందా? అవార్డును సాధిస్తుందా? అనేది వేచి చూడాల్సివుంది!