Advertisement
Google Ads BL

బన్నీ అందుకే స్టార్ హీరో అయ్యాడట!


అల్లు అర్జున్ డీజే సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత రైటర్ వక్కంతం వంశీకి నా పేరు సూర్య అవకాశం ఇచ్చాడు. అల్లు అర్జున్ కి కథలో ఎంపికలో ప్రత్యేకత ఉంటుంది. అందుకే తన సినిమాలన్నీ నలుగురు మెచ్చేలా ఉంటాయి. కానీ అల్లు అర్జున్, వక్కంతం చెప్పిన నా పేరు సూర్య కథకి బాగా కనెక్ట్ అయ్యాడు. కానీ సినిమానే ప్రేక్షకులు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు అనడానికి లేకుండా పోయింది. వక్కంతం కేవలం అల్లు అర్జున్ ని హైలెట్ చేస్తూ మిగతా చాలా విషయాలను విస్మరించాడు. నా పేరు సూర్య కి రావడమే యావరేజ్ టాక్ వచ్చింది. ఇక కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. పెట్టిన పెట్టుబడి కూడా రావడం కష్టమనే ఫీలింగ్ లో ఉన్నారు.

Advertisement
CJ Advs

ఇక వక్కంతం వంశి తనకి నా పేరు సూర్య అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. తాను నా పేరు సూర్య విషయంలో కొన్ని పొరపాట్లు చేశానని.. ఇంతకుముందే ఒప్పుకున్న వక్కంతం, అల్లు అర్జున్ తనకి మొదటి హీరోగా దొరకడం తన అదృష్టం అంటున్నాడు. తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వక్కంతం.. అల్లు అర్జున్ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు.  అల్లు అర్జున్ కి పని మీద డెడికేషన్ ఎక్కువని.... తాను చేయబోయే సీన్ కి సంబంధించిన డైలాగ్స్ ను ముందే డైరెక్టర్ దగ్గర అడిగి తెలుసుకుంటాడని చెప్పుకొచ్చాడు. అలాగే ఒక వైపున షూటింగ్ జరుగుతూ ఉంటే... అల్లు అర్జున్ మరో వైపున ఒంటరిగా ఒక చోట కూర్చుని తన డైలాగ్స్ ను ప్రాక్టీస్ చేస్తుంటాడట. కేవలం డైలాగ్స్ విషయంలోనే కాదు .. డాన్స్ విషయంలోను అల్లు అర్జున్ రిహార్సల్ చేస్తాడట. 

ఇంకా ఆయన మాట్లాడుతూ.. అంతగా కష్టపడే అల్లు అర్జున్ సాంగ్ షూటింగుకి రెండు మూడు రోజుల ముందే స్టెప్స్ కంపోజ్ అయ్యేలా చూసుకుంటాడు. అప్పటి నుంచి డాన్స్ షూటింగ్ వరకూ ఆ స్టెప్స్ ని ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. అసలు రిహార్సల్స్ లేకుండా అల్లు అర్జున్ సాంగ్ షూట్ కూడా పెట్టనివ్వడు. అంతలాంటి హార్డ్ వర్క్ చేస్తాడు గనుకనే ఆయన స్టార్ హీరో అయ్యాడు. అలాగే నాకు అయన అంతటి హీరో ఎలా కాగలిగాడో నా సినిమాతో పూర్తిగా అర్ధమయ్యింది అంటూ అల్లు అర్జున్ ని మోసేస్తున్నాడు వక్కంతం వంశీ.

Vakkantham Vamsi Praises Allu Arjun:

Vakkantham Vamsi About Allu Arjun Greatness
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs