Advertisement
Google Ads BL

నాగ్ కి వర్మ నుంచి మరో తలనొప్పి!!


అసలు రామ్ గోపాల్ తో సినిమా అంటేనే అందరూ భయపడిపోతుంటే... నాగార్జున మాత్రం వర్మకి సినిమా అవకాశం ఇచ్చాడు. అందరూ నాగ్ ని తప్పు పట్టినా... కేర్ చెయ్యకుండా వర్మ డైరెక్షన్ లో ఆఫీసర్ సినిమా చేసాడు. ఇప్పటికే ఆఫీసర్ సినిమా బిజినెస్ వర్మ వలన అంతంత మాత్రంగా వుంది. సినిమా ఈ నెల 25 న విడుదలకావాల్సి ఉంది. ఇక వర్మపై ఇండస్ట్రీ మొత్తం కక్ష కట్టింది. కానీ నాగ్ మాత్రం వర్మ విషయంలో  ఏం చెయ్యలేక కూర్చున్నాడు. కానీ ఇప్పుడు నాగ్ కి వర్మ తలనెప్పి మాములుగా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆఫీసర్ సినిమా విడుదల కాకుండా బాంబే హైకోర్టు బ్రేక్ వేసింది. ఇక దీనితో వర్మ పరిస్థితి ఏమిటో గాని నాగార్జున పరిస్థితి మాత్రం కుడితిలో పడ్డ ఎలుకల మారింది.

Advertisement
CJ Advs

ఇంతకీ కోర్టు ఆఫీసర్ సినిమాకి ఎందుకు బ్రేకులు వేసింది అంటే.. వై టీ ఎంటర్ టైన్మెంట్ వాళ్ళకి వర్మ ఇవ్వాల్సిన 1.06 కోట్లు ఇవ్వకపోవడంతో... వై టీ ఎంటర్ టైన్మెంట్ సంస్థ బాంబే హైకోర్టు లో పిటిషన్ వేసింది. తమకు వర్మ ఇంకా కొంతసొమ్ము బకాయిలు చెల్లించాల్సి ఉందని.. అయితే ఇప్పటివరకు తమకి ఆ సొమ్ము చెల్లించలేదని.. వారు పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ ను పరిశీలించిన జస్టిస్ ఎస్.జె.కట్టావల్లా.. ఆఫీసర్ చిత్రానికి సంబంధించిన హక్కులను ఎవరికైనా అమ్మడమో... లేదా బదిలీ చేయడమో చేయరాదని.... నెగెటివ్ లు, లేదా డిజిటల్ ప్రింట్లను విడుదల చేయరాదని వర్మను ఎస్.జె.కట్టావల్లా ఆదేశించారు.

కానీ వర్మ కోర్టు ఇచ్చిన వాయిదాలకు హాజరవకుండా ఒక వాయిదాకి వర్మ లాయరు హాజరవడం... మరో వాయిదాకి ఆఫీసర్ సహా నిర్మాత హాజరావడంతో.... ఏమైనా వర్మే తన బకాయిల విషయమై అంగీకార పత్రంపై సంతకం చేయాలని... కోర్టుకు స్వయంగా హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరి ఆఫీసర్ చిత్రాన్ని స్వయంగా రామ్ గోపాల్ వర్మ తన కంపెనీ బ్యానర్ లో నిర్మించిన విషయం తెలిసిందే. మరి ఇప్పటివరకు నాగ్ కి వర్మ విషయంలో ఉన్న తలనొప్పిలా కన్నా.. ఇప్పుడు ఈ తలనొప్పి ఎక్కువైంది.

Bombay HC halts release of Ram Gopal Varma's 'Officer':

one more headache to nag with Varma
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs