తెలుగులో సావిత్రి బయోపిక్‌గా వచ్చిన 'మహానటి' చిత్రం తెలుగులోనే కాదు... తమిళ, మలయాళీ భాషల్లో కూడా అద్భుతమైన రెస్పాన్స్‌ని సాధిస్తోంది. పెట్టుబడితో పోలిస్తే భారీ ఆదాయాలు రావడం ఖాయమని తేలిపోయింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా 'మహానటి'గా నటించిన కీర్తిసురేష్, సమంత, దుల్కర్ సల్మాన్‌లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గత కొన్నేల్ల కాలంలో వచ్చిన అద్భుతమైన చిత్రంగా విశ్లేషకులుఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు. ఇక వీకెండ్‌లో అయితే ముసలి ముతకా కూడా తమ సావిత్రమ్మ జీవితాన్ని తెరపై చూసేందుకు థియేటర్లకు పోటెత్తుతున్నారు.
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'మహానటి' పాత్రధారి కీర్తిసురేష్ మాట్లాడుతూ, తెలుగుప్రేక్షకులు సావిత్రిని దేవతగా భావిస్తారు. అలాంటి ఆమె పాత్రలో నటించడం విషయంలో ఎంతో సందేహపడ్డాను. చేయగలనా? ప్రేక్షకుల అంచనాలను అందుకోగలనా? అని పలు సందేహాలు వచ్చాయి. చివరకు ఈ పాత్రని ఛాలెంజ్‌గా తీసుకోవాలని భావించి ముందడుగు వేశాను. వాస్తవానికి ఈ పాత్ర కోసం నేను బరువు పెరగలేదు. చిన్ననాటి సావిత్రి కోసం బరువు తగ్గాల్సివచ్చింది.
ఇక మేకప్ విషయానికి వస్తే ఇందులో నాకు ప్రోస్థటిక్ మేకప్ చేశారు. ఈ మేకప్ వేయడానికి మూడు గంటల సమయం పట్టేది. దాన్ని తీసివేసేందుకు కూడా మూడు గంటలు పట్టేది. కేవలం నా కనుబొమ్మలు తీర్చిదిద్దేందుకే అరగంటకు పైగా సమయం పట్టేది. ఈ మేకప్‌లో ఉన్నప్పుడే ఏమి తినలేకపోయే దానిని. కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకునే దానిని, ఇన్నిరోజులు దాదాపు తొమ్మిది నుంచి పదిగంటలు షూటింగ్‌లోనే ఉండేదానిని, కానీ కెమెరా ముందుకు వెళ్తే మాత్రం ఇక నటన మీద తప్ప దేనిపై ధ్యాస ఉండేది కాదు.. అంటూ చెప్పుకొచ్చింది.