Advertisement
Google Ads BL

బహుముఖ ప్రజ్ఞాశాలిగా మారుతున్న హీరో..!


ఈమద్యకాలంలో పవన్‌కళ్యాణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ నుంచి మంచు మనోజ్‌, రాశిఖన్నా వరకు పాటలు పాడేందుకు గొంతులు సవరించుకుంటున్నారు. ఇక తమిళంలో బహుముఖ ప్రజ్ఞాశాలులకు కొదువలేదు. శింబు,ధనుష్‌ వంటి వారు పాటలు పాడటం, దర్శకత్వం, నిర్మాణం, పాటల రచయితలు, డైలాగ్‌ రైటర్స్‌గా కూడా తమ సత్తా చాటుతున్నారు. తాజాగా ఇదే గ్రూప్‌లోని తమిళ యంగ్‌స్టార్‌ శివకార్తికేయన్‌ కూడా చేరిపోయాడు. 

Advertisement
CJ Advs

ఇక ఈయన సంగీత దర్శకుడు అనిరుధ్‌కి మంచిస్నేహితుడు. 'త్రీ' చిత్రంలో అనిరుద్‌ సంగీతంలో ధనుష్‌ 'కొలవరి' పాట పాడినట్లు శివకార్తికేయన్‌ కూడా ఇటీవల అనిరుద్‌ సంగీతంలో వచ్చిన 'మాన్‌ కరాటే' చిత్రంలో ఆయన సొంతగా ఓ పాట పాడాడు. ఇప్పుడు నయనతార ప్రధానపాత్రను పోషిస్తున్న 'కొలమావు కోకిల' చిత్రంలోని ఓ పాటకు ఆయన సాహిత్యాన్నికూడా అందించాడు. దీనికి కూడా అనిరుధే సంగీతం అందిస్తున్నసంగతి తెలిసిందే. ఇందులో 'కలయాన మనసు' అనే పాటను శివకార్తికేయ్‌ స్వయంగా రచించాడు. ఈ పాటను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇక ఈఏడాది శివకార్తికేయన్‌ నిర్మాతగా కూడా మారుతున్నాడు. ఈ చిత్రానికి అరుణ్‌ కామరాజ్‌ దర్శకత్వం వహించాడు. ఇక నటునిగా శివకార్తికేయన్‌ ప్రస్తుతం 'సీమరాజా' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి దశకు వచ్చింది. ఇక దీని తర్వాత ఆయన స్టూడియోగ్రీన్‌ పతాకంపై రాజేష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం, రవికుమార్ దర్శత్వంలో మరో సైన్స్‌ఫిక్షన్‌ చిత్రాలలో నటించడానికి అంగీకారం తెలిపాడు. రవికుమార్‌ చిత్రానికి ఎ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈయన సాహిత్యాన్ని అందించిన నయనతార చిత్రం 'కొలమాను కోకిల' చిత్రానికి నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా, ఈ ఏడాదే ఈచిత్రం విడుదల కానుంది.

Sivakarthikeyan turns lyricist for Nayanthara:

Tamil Hero Sivakarthikeyan turns lyricist for 'Kolamavu Kokila'
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs