'మహానటి' సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. టాలీవుడ్ కి ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎవరి నోట విన్న ఈ సినిమా గురించే.. అందులో యాక్ట్ చేసిన నటీనటుల గురించే. సావిత్రి జీవిత కథను మూడు గంటల్లో చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్ నాగ అశ్విన్.
ముఖ్యంగా ఈ సినిమాలో సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్ నటన గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. సావిత్రి జీవితంలోని నవరసాలను అందంగా అలంకరించి ప్రేక్షకుల ముందుంచారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న 'మహానటి' కి ఓవర్సీస్ లో బ్రహ్మరథం పడుతున్నారు.
ఇంత అద్భుతమైన సినిమాను మనకు అందించినందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఆ చిత్ర బృందానికి గతరాత్రి డిన్నర్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి రాజమౌళి.. కీరవాణితో పాటు నిర్మాత అశ్వనీ దత్ మరియు 'మహానటి' చిత్ర బృందం హాజరయ్యారు.