అదేమిటో.. తల్లికి సంబంధించి ఒకరోజును అధికారికంగా ఫిక్స్ చేసుకుని ఆ ఒక్కరోజు మదర్స్‌డేగా పాటించడం ఏమిటో అర్ధం కాని విషయం. ఈ విషయంలో మనం కూడా పాశ్చాత్య పోకడలను అనుసరిస్తున్నాం. ప్రతి మనిషికి ప్రతిరోజు, ప్రతిక్షణం తల్లికే అంకితం అని చెప్పకుండా ఏదో తల్లికి కూడా ఓ రోజు కేటాయించి, మదర్స్‌డేలు జరపడం వైచిత్రి కాకపోతే మరేమిటి? ఇక ఈ మదర్స్‌డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, మెగాబ్రదర్ నాగబాబు, వారి ఇద్దరు సోదరీమణులు కలిసి వారి తల్లి అంజనా దేవిని కలుసుకుని ఆమెను సత్కరించి, బోకే అందజేశారు.
కానీ ఈ వేడుకకు పవన్‌కళ్యాణ్ హాజరు కాలేదు. ఆయన తిరుమలలో శ్రీవారి సేవలో ఉన్నందువల్ల ఆయన ఈ వేడుకకు రాలేకపోయాడు.ఇక నాగబాబు గతంలో తనతల్లి పేరున అంజనాప్రొడక్షన్స్ అనే బేనర్‌ని స్థాపించి చిత్రాలు నిర్మించాడు. అదే నిర్మాణ సంస్థను తమ తల్లికి గుర్తుగా కంటిన్యూ చేయడం మానివేసి, రామ్‌చరణ్ చేత 'కొణిదెల' బేనర్‌ని స్థాపించాల్సిన అవసరం ఏమిటో అర్ధం కాని విషయం. ఇక మదర్స్‌డే సందర్భంగా యంగ్‌హీరో నాగశౌర్య తానే దర్శకత్వం వహించిన 'భూమి' అనే షార్ట్‌ఫిల్మ్‌ని రూపొందించి విడుదల చేశాడు.
భూమికి ఉన్న ఓర్పే తల్లికి కూడా ఉంటుందని, ఎంత కష్టమైనా భరిస్తుంది. ఎంత భారం అయినా మోస్తుంది. కొన్ని మదమెక్కిన మగ మృగాళ్లు ఆడవారి మీద తమ పైశాచిక బలాన్ని చూపిస్తున్నాయి.భూమిని కాపాడటం కోసం మొక్కలు నాటుతున్నాం. మరి ఆడవారిని రక్షించేందుకు ఏం చేయాలి? అనే కాన్సెప్ట్‌తో ఈ షార్ట్‌ఫిల్మ్ రూపొందింది. ఇక మదర్స్‌డే సందర్భంగా పలువురి సినీ ప్రముఖులు తమ తల్లులను గుర్తు చేసుకుని, పలు కార్యక్రమాలు చేపట్టారు.