Advertisement
Google Ads BL

కత్రినా గడుసుతనం అది....!


బాలీవుడ్‌లో కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌, కత్రినా కైఫ్‌ల ఎఫైర్‌ ఓపెన్‌ సీక్రెట్‌. వీరు మూడు నాలుగేళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆ తర్వాత 2009లో బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఎవరినైనా పెళ్లి చేసుకున్నారా అంటే అది కూడా లేదు. సల్మాన్‌ఖాన్‌ ఐదు పదులు దాటిని కూడా మోస్ట్‌ డిజైరబుల్‌ బ్యాచ్‌లర్‌ గా ఉండగా, కత్రినా కూడా పెళ్లి పేరెత్తకుండా నచ్చిన వాడితో, నచ్చినంత కాలం ఎంజాయ్‌ చేస్తోంది. ఇక వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నప్పుడు కరణ్‌జోహార్‌ ఓ చాట్‌ షోలో 'సల్మాన్‌ నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే నీ సమాధానం ఏమిటి' అని అడిగాడు. 

Advertisement
CJ Advs

దానికి ఆమె గడుసుగా సమాధానం ఇచ్చింది. తాను సల్మాన్‌కి 'ఇది మోసం, చాలా అన్యాయం. ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను' అని సల్మాన్‌కి చెబుతానని సమాధానం ఇచ్చింది. ఇక నాలుగేళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగినా కూడా ఆ తర్వాత వీరెందుకు విడిపోయారో ఎవ్వరికీ చెప్పలేదు. అలాగని వ్యక్తిగత కోపాలు కూడా పెట్టుకోకుండా ఇప్పటికీ ఎంతో సన్నిహితంగా ఉంటూ ఉండటం విశేషం. 2017లో జరిగిన ఇండియా టుడే మైండ్‌ రాక్స్‌ గువాటిలో కత్రినా మాట్లాడుతూ, సల్మాన్‌ఖాన్‌ని ఆకాశానికి ఎత్తేసింది. సల్మాన్‌ ఓ అద్భుత వ్యక్తి అని కొనియాడింది. అలాగే సల్మాన్‌ కూడా కత్రినాకి ఏమీ తీసిపోకుండా ఆమెపై ప్రశంసల జల్లు కురిపించాడు. స్వీటెస్ట్‌ గర్ల్స్‌లో ఆమె ఒకరు అని ఆకాశానికి ఎత్తేశాడు. 

'టైగర్‌ జిందాహై' చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు కూడా. ఈ చిత్రం బాక్సాపీస్‌వద్ద 300కోట్లు వసూలు చేసింది. ఇలా ఈ ప్రేమపక్షులు విడిపోయినా కూడా తమ అన్యోన్యతను, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను తెలుపుకుంటూనే ఉండటం విశేషం. హృతిక్‌రోషన్‌-కంగనారౌనత్‌లలాగా ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోకుండా తమ పనేదో తాము చేసుకుంటున్నారు. అయినా వీరి ఎంజాయ్‌మెంట్‌కి పెళ్లి కావాల్సిన అవసరం ఏమి లేదు. వీరు ఎంతో స్వేచ్చా జీవులు కదా...! 

Katrina Kaif about Marriage with Salman :

When Katrina was asked her answer if Salman proposed marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs