Advertisement
Google Ads BL

పవన్ ఫ్యాన్స్ ని అడగండి: వర్మ!


రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీయడం కన్న సినిమాలను అనౌన్స్ చేయడం విషయంలో ఎక్స్పర్ట్. తనకి నచ్చిన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయే రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా సినిమా తీయడం విషయంలో స్లో అయ్యాడనే చెప్పాలి. లేటెస్ట్ గా ఇతను నాగార్జున తో 'ఆఫీసర్' అనే సినిమాను తీసాడు.

Advertisement
CJ Advs

ఆ సినిమా ప్రొమోషన్స్ టైంలో ఆయన ఓ దినపత్రికతో మాట్లాడుతూ.. గతంలో తాను ఎనౌన్స్ చేసిన సినిమాలు ఓ 10 వరకూ ఉన్నాయని, అవన్నీ సమయం వచ్చినప్పుడు వాటంతట అవే వస్తాయని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. తనకు చిన్నప్పటి నుండి వివాదం నిండిన సబ్జెక్టులంటే ఇష్టమని అన్నారు.

తన వెనుక దేవుడు ఉన్నాడని అందుకే నేను ఎవరినన్నా విమర్శించేటప్పుడు దైర్యంగా వారి విమర్శిస్తానని వర్మ అన్నాడు. తన పని అయిపోయింది అని అనుకునేవారి కోసం 'ఆఫీసర్' సినిమా తీశానని చెప్పాడు. ఈ సినిమా ట్రైలర్ కు నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడానికి గల కారణాలు ఏంటో పవన్ కల్యాణ్ అభిమానులను అడగాలని అన్నారు. అఖిల్ తో తాను ప్రకటించిన సినిమా రెండు నెలల్లో ప్రారంభమవుతుందని చెప్పారు.

Ram Gopal Varma about Officer Negative Response :

RGV Reaction on Officer Trailer Report 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs