Advertisement
Google Ads BL

'మహానటి'ని చూడాలని ఉందిట...!


సావిత్రి జీవిత చరిత్రను 'మహానటి'గా తీయడం, ఆ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో సావిత్రి జీవితాన్ని ఎంతో హృద్యంగా చూపించారన్నది వాస్తవమే. కానీ ఆమె చివరిరోజుల్లో మన గొప్ప గొప్పవారుగా భావించే నటీనటులు ఆమెకి ఏ సాయం ఎందుకు చేయలేదు? అనే విషయం కూడా ఇందులో చూపించి ఉంటే బాగుండేది. బహుశా ఆయా దేవుళ్లుగా కొలిచే హీరోలను తప్పుగా చూపిస్తే, తప్పుగా కాదు...వాస్తవాలు చూపిస్తే వారి అభిమానులు, ఆయా వారసులు ఎక్కడ బాధపడిపోతారో అనే భయంతోనే ఆమెకి సహాయం చేయని పెద్దల విషయాన్ని పెద్దగా సినిమాలో పట్టించుకోలేదు. 

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రం తీస్తున్నారని చెప్పినప్పుడు సావిత్రి పిల్లలు అల్లుడుతో సహా ఇది ట్రాజెడీగా తీస్తున్నారా? అని అనుమాన పడ్డారు. ఇదే అనుమానం బాలీవుట్‌ నటి రేఖకి కూడా వచ్చిందట. ఈమె తల్లి పుష్పవల్లి జెమిని గణేషన్‌ భార్యల్లో ఒకరు. అంటే రేఖకి సావిత్రి పిన్ని అవుతుంది. మొదట ఈచిత్రం తీస్తున్నారని తెలిసినప్పుడు ఈ చిత్రం గురించి వాకబు చేసి, తన తండ్రిని, తన తల్లిని ఎలా చూపిస్తున్నారో తెలుసుకోవాలని రేఖ భావించిందట. కానీ ఈ చిత్రం విడుదలైన తర్వాత తన సోదరి రాధ ద్వారా సినిమా చూడాలని ఉందని ఈ చిత్ర దర్శకనిర్మాతలు కోరిందని సమాచారం. ఈ సినిమా గురించి తెలుసుకున్నప్పుడు రేఖ ఎంతో ఉత్సాహం చూపించారు. తర్వాత ఈ చిత్రం గురించి సందేహాలు ఉన్నాయి. వాటిని క్లారిఫై చేసుకోవాలని భావించారు. 

ఇక ఈ చిత్రంకి వచ్చిన టాక్‌ని చూసి ఆమె సినిమా చూడాలని కోరుకుంటున్నారని ఆమె సన్నిహితులు అంటున్నారు. మొత్తానికి సావిత్రి సినీ, రాజకీయ, నాటి జనరేషన్‌, నేటి జనరేషన్‌, సావిత్రికి సన్నిహితులు, బంధువులు అందరి నుంచి ప్రశంసలు అందుకోవడం విశేషం. వైజయంతీ బేనర్‌లో చాలా కాలం తర్వాత వచ్చిన జెన్యూన్‌ హిట్‌ ఈ చిత్రమేనని చెప్పాలి!

Gemini Ganesan's First Daughter On Mahanati:

Rekha keen to see her father's story in Mahanati
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs