పెళ్లయిన తర్వాత హీరోయిన్లను పట్టించుకోరు అనే విషయాన్ని సమంత తప్పు అని నిరూపించింది. తన వివాహం జరిగిన తర్వాత ఆమె నటించిన నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. పెళ్లయిన వెంటనే 'రాజుగారి గది2'లో తన మామ నాగార్జునతో కలిసి నటించింది. ఈ చిత్రం ఫలితం ఎలా ఉన్నా సమంత సాహసోపేతంగా చేసిన పాత్రకి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇటీవల ఆమె నటించిన మూడు చిత్రాలు తక్కువ వ్యవధిలో వరుసగా హిట్స్‌కొట్టి సమంత హ్యాట్రిక్‌ని సాధించింది. సామాన్యంగా చాలా గ్యాప్‌లో హ్యాట్రిక్‌లు రావడం చాలానే చూశాం. కానీ తక్కువ వ్యవధిలో హాట్రిక్ హిట్స్ కొట్టిన ఘనత మాత్రం సమంత తన ఖాతాలో వేసుకుంది.
ఆమె రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' చిత్రంలో రామలక్ష్మిగా అదరగొట్టడమే కాదు.. ఈ చిత్రం తెలుగు నాట, ఓవర్‌సీస్‌లో కూడా అద్భుత కలెక్షన్లు సాధించి, నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రంలో ఆమె పెళ్లయినా కూడా ముద్దుసీన్‌లో నటించిన వృత్తి వేరు, వ్యక్తిగత జీవితం వేరని డేర్‌గా నిరూపించింది. ఇక 9వ తేదీన 'మహానటి' చిత్రంలో మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌లో సమంత తన పంచప్రాణాలు ఒడ్డి అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌ని ఇచ్చింది. ఇక ఈ చిత్రం ద్వారా మొదటిసారి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం, అందునా 'మహానటి'లోని మధురవాణి పాత్రకు ఓన్ డబ్బింగ్ చెప్పడంలో సమంతని, ఆమె చేత డబ్బింగ్ చెప్పించిన నాగ్ అశ్విన్‌ని ఇద్దరికీ ఈ క్రెడిట్ దక్కుతుంది. ఇక ఈ సందర్భంగా ఆమె మామ నాగార్జున ఆమెని ప్రశంసించగా 'థాంక్యూ మామా' అని తెలిపింది.
ఇక నిన్న ఆమె విశాల్ సరసన నటించిన 'ఇరుంబుదురై' చిత్రం కూడా పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుని హిట్ కావడం ఖాయమనే టాక్‌ని తెచ్చుకుంది. ఈ చిత్రం చూసిన విశ్లేషకులు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఈచిత్రం ఈనెల 17న తెలుగులో 'అభిమన్యుడు'గా విడుదల కానుంది. మొత్తానికి ఒక నెలకు అటు ఇటుగా సమంత హాట్రిక్ ఫీట్‌ని సాధించడం చూసి మాత్రం మనం గర్వపడాల్సిన విషయమేనని చెప్పాలి.