Advertisement
Google Ads BL

సమంత ఎంత సంతోషంగా ఉందో చూశారా!!


టాలీవుడ్ లో ప్రస్తుతం సమంత గురించే మాట్లాడుకుంటున్నారు. నాగ చైతన్యతో పెళ్లి అయ్యాక వరసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టింది. మూడు సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆయా సినిమాల్లో సామ్ నటన గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. సినిమాల మధ్య గ్యాప్ కూడా తక్కువగా ఉండటంతో సామ్ అందరి నోట్లలో నానుతుంది.

Advertisement
CJ Advs

మొన్ననే 'రంగస్థలం' సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 9వ తేదీన విడుదలైన 'మహానటి' సినిమాలో సమంత మెయిన్ లీడ్ కాకపోయినా.. ఆమె చుట్టూ స్టోరీ తిరుగుతుంది కాబట్టి తన పాత్రకు న్యాయం చేసి అందరి మనసులు గెలుచుకుంది ఈ అక్కినేని వారి కోడలు.

ఇక సమంత లేటెస్ట్ తమిళ్ మూవీ 'ఇరుంబు తిరై'  తాజాగా విడుదలై అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. విశాల్ కు జోడిగా సామ్ ఇందులో నటించింది. దాదాపు ఈ సినిమా హిట్ చిత్రాల జాబితాలోకి చేరిపోయినట్టేననే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సమంత సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు సినిమాలకు సంబంధించి స్టిల్స్ ను తన సోషల్ నెట్ వర్క్ లో పోస్ట్ చేస్తూ.. 'ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ఆనందంగా వున్న అమ్మాయిని నేనే' అంటూ ట్వీట్ చేసింది. 

Samantha Happy with Hat-Trick Hits:

Samantha Full Happy Mood with Movies Success 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs