మననాయకులు చేసేవి ఒకే తరహా యాత్రలైనా వాటికి పేర్లకి కూడా ఎంతో ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబునాయుడు, ఇక దీక్షలు, నిరసనలు, జగన్ యాత్రలు ఇలా పేర్లు వేరైనా వాటి ఆశయం మాత్రం ప్రజా ఓట్లను కొల్లగొట్టడమే. ఇప్పటి నుంచే ఎన్నికల సెగని రగిలించి, ఓట్లను పిండుకోవడమే. కాకపోతే కొందరు పాదయాత్రలు చేస్తే ఎన్టీఆర్ వంటి వారు చైతన్యరథం అని పేరు పెట్టి యాత్రలు చేశారు. మొత్తానికి యాత్రల మూలం స్థానిక, ప్రజా సమస్యలను తెలుసుకోవడమే అయినా మన నాయకులు మాత్రం తామంటే ప్రజల్లో ఉన్న క్రేజ్, ఇమేజ్‌ని క్యాష్ చేసుకుని తమ పార్టీల బలోపేతం కోసం, ఇతర పార్టీలను విమర్శించడం కోసం యాత్రలు చేస్తుంటారు.
ఇక తాజాగా జనసేనాధిపతి పవన్‌కల్యాణ్ కూడా తన ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలలో యాత్రను బస్సు యాత్రగా చేయనున్నాడని సమాచారం. బహుశా బస్సు అంటే దానికి కూడా చైతన్యరథం వంటి గెటప్, సెట్ వేసి, ఆ వాహనానికి కూడా ఏదో పేరు పెట్టడం ఖాయమే. ఇక ఈ యాత్ర పేరు స్వరాజ్యయాత్ర అని పేరు పెట్టనున్నారు. అయినా బ్రిటిష్‌వారు ఉన్నప్పుడే బెటర్, తెల్ల దొరలు పోయి నల్ల దొరలు, మన దేశస్తులే దొరలుగా మారారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక మనకంటూ స్వరాజ్యం ఏముంది కనుక?ప్రజలు అంటే ఓటు బ్యాంకు. పశువులా ఎన్నికల్లో కసాయి వారికి ఓటేసి, తమ నాయకుల పెత్తనానికి, దోపిడీకి మనమే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం అనమాట.
కాబట్టి స్వరాజ్య యాత్ర అన్నా, అసుర యాత్ర అన్నా పెద్దగా తేడా ఏమి ఉండదు. ఇక పవన్ 40రోజుల తన యాత్రలో కాస్త కాస్త విరామాలు తీసుకుని, ఎందుకైనా మంచిదని, తాను నటించకపోయినా సినిమా వేడుకల్లో అయినా కనిపించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఏపీలోని 175 నియోజకవర్గాలలో పోటీ చేస్తానంటున్నాడు. మరి పాపం వామపక్షాల సంగతేంటి? త్వరలోనే అందరు అభ్యర్ధులను ముందుగానే ఎంపికచేసి వారిచేత నియోజక వర్గాల్లో సమస్యలపై దృష్టిసారించేలా చేయనున్నాడు పవన్.