Advertisement
Google Ads BL

ప్రభుదేవాని పెళ్లి చేసుకుంటా: యంగ్ హీరోయిన్!


మొదటి సినిమానే పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ సరసన హీరోయిన్‌ అంటే ఇక వారి ఆనందానికి అవధులే ఉండవు. కానీ సినిమా ఆడకపోతే తప్పు హీరో మీద, డైరెక్టర్ల మీద కాకుండా హీరోయిన్ల మీద వేయడం బాధాకరం. ఎన్ని ఫ్లాప్‌లు వచ్చినా ఆయా స్టార్స్‌కి, దర్శకులకు చాన్స్‌లు వచ్చినా హీరోయిన్లకు మాత్రం అవకాశాలు ఇవ్వరు. ఇక 'కొమరం పులి' చిత్రం విషయంలో పవన్‌, ఎస్‌.జె.సూర్య బాగానే ఉన్నా ఫ్లాప్‌ఖాతాని మాత్రం నికిషా పటేల్‌ అకౌంట్లో జమ చేశారు. ఆ తర్వాత ఈమెకి పెద్దగా చాన్స్‌లు రాలేదు. దాంతో చిన్నతరహా తమిళ చిత్రాలతో కోలీవుడ్‌లో బండి లాగిస్తోంది. 

Advertisement
CJ Advs

మరోవైపు తనకి బాలీవుడ్‌ చిత్రాలలో కూడా అవకాశాలు వస్తున్నాయని చెబుతోంది. ఈమె తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. మీరు ప్రభుదేవాతో కలిసి నటిస్తారా? అని అడిగితే, మీరు కేవలం సినిమాలలో నటిస్తారా? అనే అడుగుతున్నారు. నాకు మాత్రం ప్రభుదేవాను వివాహం చేసుకోవాలని ఉంది. ఆయనతో నాకు, మా కుటుంబానికి కూడా మంచి పరిచయాలు ఉన్నాయంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. 

గతంలో ప్రభుదేవా తన భార్యకి విడాకులిచ్చి, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు నయనతారని వివాహం చేసుకోవాలని భావించాడు. కానీ పెళ్లి పీటల వరకు వచ్చిన ఈ వివాహం ప్రభుదేవా మొదటి భార్య నిరాహారదీక్ష చేసే వరకు వెళ్లింది. చివరి క్షణంలో ప్రభుదేవా, నయనతారల వివాహం బ్రేకప్‌ అయింది. మరి నికిషా పటేల్‌ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఏదో విషయం లేకుండానే ఆమె అలా పబ్లిగ్గా ఎలా మాట్లాడుతుంది? అనే అనుమానాలు వస్తున్నాయి. 

Nikesha Patel ready to marry Prabhu Deva:

Nikesha Patel reveals her desire to marry Prabhu Deva
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs