వాస్తవానికి మీడియాలో వచ్చే రివ్యూలు, ఇతర విషయాలలో సినిమా వారు మండిపడుతూ ఉంటారు గానీ ఇటీవలి కాలంలో చిన్నచిత్రాలుగా వచ్చిన 'అర్జున్‌రెడ్డి, ఫిదా, భాగమతి, తొలిప్రేమ, శతమానం భవతి, రంగస్థలం, భరత్ అనే నేను' తాజాగా 'మహానటి' వీటన్నింటికి మీడియా అండగా నిలవడమే కాదు.. మంచి రేటింగ్స్ ఇచ్చింది. ఇక బాగా లేని చిత్రానికి కూడా మంచి రేటింగ్‌లు ఇవ్వడానికి ఎవ్వరూ సిద్దపడరు. ఈ విషయంలో సినిమావారు మీడియాపై మండిపడుతున్నారు. తాజాగా కూడా తమ్మారెడ్డి, దర్శకుడు మారుతి, అల్లుఅర్జున్ వంటి వారు మీడియాపై చిందులేస్తున్నారు.
ఏ చిత్రమైనా ప్రజలకు నచ్చితేనే ఆడుతుంది కానీ బాగోని సినిమాకి కూడా బాగుందని రేటింగ్ ఇచ్చి తమ గుడ్‌విల్‌ని ఎవ్వరూ పాడుచేసుకోరు. ఇక ఇప్పుడు 'నాపేరు సూర్య...నా ఇల్లు ఇండియా' విషయంలో కూడా పలువురు సినీ ప్రముఖులు దీనిని హిట్ అని, కావాలనే డివైడ్ టాక్‌ని మీడియా తెచ్చిందని మండిపడుతున్నారు. అల్లు అరవింద్ అయితే ఈ చిత్రంపై కుట్ర జరుగుతోందని ముందుగానే స్కెచ్ రెడీ చేశాడు.
ఇక విషయానికి వస్తే తాజాగా 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' చిత్రానికి సక్సెస్ మీట్‌ని థాంక్యూ ఇండియా మీట్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లుఅర్జున్ మాట్లాడుతూ.. నేను చెప్పిన ధ్యాంక్సులో మొదటిది ముఖ్య అతిధిగా వచ్చిన పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ గారికి. ఇక్కడికి వచ్చిన పవర్‌స్టార్ అభిమానులు, నా అభిమానులకు కూడా ధ్యాంక్స్. ఇక ఈ చిత్రం విషయంలో నాకొస్తున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటంటే.. పలువురు మహిళలు ఫోన్ చేసి మా పిల్లలు మిలటరీ యూనిఫాం కుట్టించుకుంటామని అల్లరి చేస్తున్నారు. సినిమా బాగుంది. మీ వల్లనే మా పిల్లలు ఇలా మిలటరీ యూనిఫాంలు అడుగుతున్నారని చెబుతున్నారు. ఈ చిత్రం విషయంలో నాకు వచ్చిన బెస్ట్‌కాంప్లిమెంట్స్ ఇవే అని చెప్పుకొచ్చాడు.