Advertisement
Google Ads BL

అను.. సూర్యకి హ్యాండిచ్చినట్లేగా..!!


ఈ ఏడాది అజ్ఞాతవాసి సినిమాతో భారీ డిజాస్టర్ అందుకుంది మజ్ను భామ అను ఇమ్మాన్యుయేల్. ఆ సినిమాలో అను పాత్రకి అస్సలు ప్రాధాన్యమే ఉండదు. ఆ సినిమా విడుదల కాకముందే నా పేరు సూర్య సినిమాలో మెగా హీరో అల్లు అర్జున్ పక్కన నటిస్తే.. ఆ సినిమాకి టాక్ అంతంత మాత్రంగానే ఉంది. అందులోను నా పేరు సూర్య సినిమాలో అను పాత్రకి అస్సలు ఆదరణ లేదు. అను ని కేవలం పాటల కోసం, గ్లామర్ డాల్ గా చూపించాడనికే దర్శకుడు వంశి ఆమెని తీసుకున్నట్లుగా ఉన్నాడు. అయితే అనుకి సినిమా పోతుందని ముందే తెలుసేమో అందుకే నా పేరు సూర్య ప్రమోషన్స్ లో ఎక్కడా సోలో ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. సినిమా విడులయ్యాక కూడా అను మీడియాకి కనబడితే ఒట్టు.

Advertisement
CJ Advs

తాజాగా ఆమె నా పేరు సూర్య థాంక్స్  మీట్ కి కూడా హ్యాండ్ ఇచ్చింది. అయితే నా పేరు సూర్య ఈవెంట్ కి అలా హ్యాండిచ్చిన అను ఇమ్మాన్యుయేల్ సింపుల్ గా సూర్య టీమ్ కి అభిమానులకి సారీ కూడా చెప్పింది. నా పేరు సూర్య సక్సెస్ మీట్ కు తాను హాజరుకాలేకపోతున్నానంటూ అనూ కాస్తంత బాధగా ట్వీట్ చేసింది. అయితే తానూ ఈ ఈవెంట్ కి ఎందుకు రాలేకపోతుందో కూడా చెప్పింది. అదేమిటంటే... ‘దురదృష్టవశాత్తు నా పేరు సూర్య  థ్యాంక్స్ మీట్ కు రాలేకపోతున్నా.... నిజంగా వద్దామనే అనుకున్నాను కానీ..... కుటుంబ కారణాల వల్ల కుదరట్లేదు. ఈ చిత్రం నాకు ఎంతో ప్రత్యేకమైంది. ఈ చిత్రంలో నాకు అవకాశం లభించడం గొప్పగా భావిస్తున్నాను.. థ్యాంక్యూ..’ అంటూ ట్వీట్ చేసింది.

మరి కెరీర్ ఆరంభంలో పెద్ద హీరోలతో సినిమాలు చేసే నీకు ఇలా తలా బిరుసుగా ఉంటే కష్టం పాప అంటున్నారు. అందుకే అల్లు అర్జున్ తో చేసిన నా పేరు సూర్య ప్రమోషన్స్ కి లేకుండా సారీ లు చెబుతుంది అంటూ మెగా ఫాన్స్ ఊగిపోతున్నారు. మరి నిజంగానే ఎన్ని ప్రోబ్లెంస్ ఉన్నా ఈ ఈవెంట్ కి అయినా అను రావాల్సింది. మరి ఇలా చేస్తే ఇక అవకాశాలెమోస్తాయ్ అను.. ఆలోచించు.

Anu Emmanuel Is Not Reachable?:

Anu Emmanuel says Sorry to Naa Peru Surya team
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs