Advertisement
Google Ads BL

మహానటిపై సుకుమార్ రాసిన లేఖ.. అద్భుతం!!


రంగస్థలం హిట్ తో బాగా ఎంజాయ్ చేసి హాట్ హాట్ న్యూస్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సుకుమార్ కొద్దిగా గ్యాప్ తీసుకుని మళ్ళీ వార్తల్లోకొచ్చేసాడు. తాజాగా హిట్ అయిన మహానటి సినిమా చూసి మైమరచిపోయి..  థియేటర్ బయటికొచ్చిన సుకుమార్ కి ఒక అద్భుతమైన సంఘటన జరిగిందట. ఆ సంఘటను ఒక లేక రూపంలో సుకుమార్ ఎలా వివరించాడో మీరు చూడండి. మహానటిని డైరెక్ట్ చేసిన నాగ్ అశ్విన్ కి ఈ లేఖ రాసాడు సుకుమార్.

Advertisement
CJ Advs

'ప్రియమైన అశ్విన్..  మహానటి సినిమా చూసి బయటకి వచ్చి నీతో మాట్లాదామని నీ నంబర్ కి ట్రై చేస్తున్నాను. ఈలోగా ఒక ఆవిడ వచ్చి 'నువ్వు డైరెక్టరా బాబు' అని అడిగింది. అవునన్నాను.. అంతే.. నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది' ఎంత బాగా చూపించావో బాబు మా సావిత్రమ్మని' అంటూ..  నా కళ్లల్లో నీళ్లు.. నేను నువ్వు కాదని ఆవిడకి చెప్పలేకపోయాను.. ఆవిడ ప్రేమంతా నేనే తీసుకున్నాను.. మనసారా.. ఆవిడా నన్ను దీవించి వెళ్లిపోయింది.. కొన్ని క్షణాలు నువ్వే నేనైపోయాను. ఆనందంతో.. ఇంతకన్నా ఏం చెప్తాను.. నా అనుభూతి ఈ సినిమా గురించి.. ఆవిడకి ఎప్పటికీ నేను నువ్వు  కాదని తెలియకపోతే బావుండు...' అంటూ ఏంటో ఆసక్తికరమైన ఈ లెటర్ ని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

మరి సుకుమార్ ఇలా చెబుతుంటే... ఫ్యామిలీ, సీనియర్ ప్రేక్షకులు మహానటి కి ఎంతగా కనెక్ట్ అయ్యారో అనిపిస్తుంది. ప్రస్తుతానికి మహానటి మూవీ సూపర్ హిట్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది.

Sukumar Emotional Letter On Mahanati Movie:

<span>Sukumar</span><span>&nbsp;Reaction After Watching&nbsp;</span><span>Mahanati</span><span>&nbsp;Movie</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs