Advertisement
Google Ads BL

పూరి ఏమవుతాడో..?


ఒకే ఒక్క సినిమా ఇద్దరిని నడి సముద్రంలో పడేసింది. అది విడుదలకు ముందు ఏ మాత్రం అంచనాలు లేని మహానటి మూవీ. మహానటి మూవీ నిన్న బుధవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మహానటి మూవీ తీసిన నాగ్ అశ్విన్ పై ప్రశంసల జల్లు కురుస్తుంది. అలాగే కీర్తి సురేష్ చేసిన సావిత్రి పాత్రకు అంటే నీరాజనాలు పడుతున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మహానటి సినిమా వలన అసలే అంతంత మాత్రం ఉన్న నా పేరు సూర్యా కలెక్షన్స్... మహానటి మూవీ తో గండికొడుతున్నాయి. ఇప్పటికే కష్టాల్లో ఉన్న నా పేరు సూర్య, మహానటి మూవీ తో మరింత కష్టాల్లోకి జారిపోయింది. ఇక రెండో సినిమా మెహబూబా.

Advertisement
CJ Advs

ఫ్రెష్ లవ్ స్టోరీ తో పూరి జగన్నాధ్ దర్శకుడిగా ఓన్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన మెహబూబా సినిమా రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి మహానటి  కి సూపర్ హిట్ టాక్ రావడం... హీరోగా పరిచయమవుతున్న ఆకాష్ పూరి మీద ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేకపోవడం.. మెహబూబా ని ఇబ్బందుల్లో పడేసేలా కనబడుతుంది. అలాగే పూరి జగన్నాధ్ కూడా ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు. దర్శకుడిగా వరుస సినిమాల డిజాస్టర్స్ తో బాధపడుతున్న పూరి కి ఈ మెహబూబా సినిమా హిట్ అత్యవసరం. అలాగే తన డబ్బుకి మొత్తం పూరి కనెక్ట్స పేరుతొ మెహబూబా కి పెట్టేసాడు. మరి సినిమా టాక్ తేడా వచ్చిందా పూరి పని అయిపోతుంది.

మహానటి సినిమాపై పెద్దగా అంచనాలు లేని పూరి మెహబూబాని పోటీకి విడుదల చేస్తున్నాడు. మరి మహానటిపై ఎవరికీ అంచనాలు లేవు. కానీ మహానటి అనూహ్యంగా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు పూరి పరిస్థితి గోతిలో పడ్డ ఎలుకగా మారింది. ఎందుకంటే మెహబూబా సినిమా కాస్త బావుంది అనే టాక్ వస్తే తప్ప.. లేకుంటే మహానటి ముందు ఈ సినిమా నిలవడం అనేది సాధ్యం కాని పని. మరి మెహబూబా ఏమిటనేది.. రేపు ఈపాటికి అర్ధమవుతుంది.

Mahanati Talk Effect on Puri Jagannath Mehbooba Movie:

Mahanati Talk Effect on Puri Jagannath Mehbooba Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs