బాహుబలి తర్వాత రాజమౌళి దాదాపుగా ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని మళ్ళీ పిచ్చ ఇంట్రెస్టింగ్ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ కి శ్రీకారం చుట్టాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి ఒక అద్భుతమైన మల్టీస్టారర్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టేసాడు రాజమౌళి. ఇక ప్రస్తుతం రంగస్థలం సినిమా తో హిట్ కొట్టిన రామ్ చరణ్, బోయపాటి సినిమాతో సెట్స్ మీదున్నాడు. అలాగే ఎన్టీఆర్ కూడా లాంగ్ గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ సినిమాతో సెట్స్ మీదున్నాడు. వీరిద్దరి ప్రస్తుత సినిమా లు పూర్తి కాగానే రాజమౌళి తన మంది మార్బలంతో #RRR ని పట్టాలెక్కిస్తాడు.
అయితే రాజమౌళి సినిమా ఎలాంటి కథతో ఉండబోతుందో అనే దాని మీద అనేక రకాలు కథనాలు, కథలు ప్రచారంలోకి వచ్చాయి. రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ లను అన్నదమ్ములుగా చూపించబోతున్నాడని.. అలాగే ఈ సినిమా కథ మొత్తం క్రీడా నేపథ్యంలో ఉండబోతుందని... అందులోను బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందనే టాక్ మొదటి నుంచి బాగా ప్రచారంలో ఉంది. అయితే రంగస్థలం ఇంటర్వ్యూ అప్పుడు రాజమౌళి సినిమా గురించిన విషయాలేమి బయటపెట్టని రామ్ చరణ్ ఇప్పుడు తమ మల్టీస్టారర్ సినిమాపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు.
చరణ్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ రాజమౌళి తో ఎన్టీఆర్, తాను చెయ్యబోయే సినిమా గురించిన విషయాలు ప్రస్తావించాడు. తమ సినిమా కథ మీద వస్తున్న వార్తలన్ని కేవలం పుకార్లే అని.. అసలు తాను ఎన్టీఆర్ అన్నదమ్ములుగా కనిపించడం దగ్గరనుండి... ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యం కొనసాగుతుందని... వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అవన్నీ ఒట్టి పుకార్లే అని కొట్టి పడెయ్యడంమే కాదు... #RRR అసలు కథ వేరే ఉందనీ .. ఆ కథ కూడా అత్యంత ఆసక్తికరంగా ఉంటుందని ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు.