Advertisement
Google Ads BL

మహానటి కి భారీ డిమాండ్!!


అశ్విని దత్ గతంలో బడా స్టార్ హీరోలతో బడా సినిమాలు నిర్మించి బడా ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు. కానీ ఈమధ్య కాలంలో అంటే గత ఐదారేళ్లల్లో నిర్మాతగా అశ్విని దత్ చాలానే పోగొట్టుకుని... నిర్మాతగా యాక్టివ్ పాత్ర పోషించడం మానేసాడు. అయితే ప్రస్తుతం మహేష్ సినిమాకి వన్ అఫ్ ది నిర్మాతగానూ, నాని, నాగార్జున మల్టీస్టారర్ కి నిర్మాతగానూ చేస్తున్న అశ్విని దత్... ప్రస్తుతం తన కూతుళ్లు, అల్లుడు అందించిన మహానటి మూవీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రియా, స్వప్న దత్ లు సంయుక్తంగా నిర్మించిన మహానటి మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మహానటి సావిత్రి జీవిత చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా నాగ్ అశ్విన్ వెండి తెర మీద ప్రెజెంట్ చేసాడు. సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడమే కాదు... సూపర్ హిట్ అయ్యింది కూడా.

Advertisement
CJ Advs

ఇక సినిమాని విడుదలకు ముందే అమ్మసి క్యాష్ చేసుకున్న అశ్విని దత్ అండ్ కో.. మహానటి శాటిలైట్ హక్కులను మాత్రం తమ వద్దే ఉంచుకున్నారు. అయితే మహానటి శాటిలైట్ హక్కులు కూడా అమ్మేసేవారే ... అశ్వినీదత్ చెప్పిన రేటుకి ఎవరూ కొనలేదు. రెండు బడా ఛానల్స్ మహానటి శాటిలైట్ హక్కుల కోసం పోటీ పడినప్పటికీ... అశ్వినీదత్ చెప్పిన రేటుకి కొనలేదు. అయితే అప్పుడు అమ్మకపోయినా ఇప్పుడు అశ్వినీదత్ మహానటి శాటిలైట్ హక్కులను తాను అనుకున్న రేటుకే విక్రయించగలడు.

మరి అశ్విని చెప్పిన రేటుని చెల్లించి ఏ ఛానల్ మహానటి ని దక్కించుకుంటుందో గాని... ఆ ఛానల్ టీఆర్పీలు మాత్రం ఒక లెవల్లో ఉండడం ఖాయం. సావిత్రి కేవలం థియేటర్ ప్రేక్షకులకే కాదు... పెద్దవాళ్లకు ఆరాధ్య దేవతే. మరి వారంతా థియేటర్ కొచ్చి సినిమా  చూడకపోయినా... టివి ఛానల్ లో వస్తే మాత్రం వదలరు. మరి ఆ టీఆర్పీలను ఊహించుకుంటూ పలు ఛానల్స్ మహానటి శాటిలైట్ హక్కుల కోసం పోటీ పడతాయ్. మరి ఆ హక్కులను ఏ ఛానల్ దక్కించుకుంటుందో కానీ... ఇక ఆ ఛానల్ కి పండగే పండగ.

Mahanati Gets Hit Talk:

Mahanati Gets Hit Talk I<span>n Overseas</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs